News October 7, 2025
పీలేరు ఎమ్మెల్యే పీఏ బెదిరిస్తున్నారని ఫిర్యాదు

తమను చంపేస్తామని పీలేరు MLA కిషోర్ కుమార్ రెడ్డి PA సత్య బెదిరిస్తున్నారని పట్టణంలోని చెన్నారెడ్డి వీధికి చెందిన అనురాధ ఆరోపించారు. ‘MNR గార్డెన్స్ ఎదురుగా 38అంకణాల స్థలం కొని అందులో బోరు వేసి ప్రహరీ కట్టించా. సత్య, అతని బంధువు మనోహర్ ప్రహరీని కూలగొట్టి నా స్థలం కబ్జా చేశారు. ఆ స్థలంలో నేను అడుగు పెడితే చంపేస్తామంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏమీ చేయలేమన్నారు’ అంటూ ఆమె SPకి ఫిర్యాదు చేశారు.
Similar News
News March 20, 2026
ఏర్పేడు: అప్రెంటిస్ పోస్టులకు ఇంటర్వ్యూలు

IIT తిరుపతిలో నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) ద్వారా గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. డిగ్రీ-16, డిప్లొమా-14 మొత్తం 40 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. 27, 28, 29 తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జరుగుతాయని, వివరాలకు https://www.iittp.ac.in/Interns_and_Apprentice వెబ్ సైట్ చూడాలని అధికారులు కోరారు.
News March 20, 2026
మెడికల్ పీజీ సీట్ల భర్తీ.. సుప్రీంకోర్టుకు కాలేజీలు

AP, TGలో ఖాళీగా ఉన్న మెడికల్ సీట్ల భర్తీపై కాలేజీల యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. FEB 28తో కౌన్సెలింగ్ ముగియగా ఏపీలో 246, టీజీలో 377 పీజీ సీట్లు భర్తీ కాలేదని తెలిపాయి. కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నప్పటికీ కౌన్సెలింగ్ గడువును పొడిగించలేదన్నాయి. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.
News March 20, 2026
ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం జిల్లాలోని అర్హులైన షెడ్యూల్డ్ కులాల (SC) యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంఘం కార్యనిర్వాహక సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు.అర్హులైన ఎస్సీ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు www.tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.


