News October 7, 2025

రేణిగుంటకు చేరుకున్న మంత్రి లోకేశ్

image

మంత్రి నారా లోకేశ్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. తుడా మాజీ ఛైర్మన్ నరసింహ యాదవ్ ఆయనకు స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన నారావారిపల్లికి బయలుదేరారు.

Similar News

News March 21, 2026

ప్రతి 45 రోజులకు ఒక కొత్త ఎయిర్‌పోర్ట్: రామ్మోహన్

image

దేశంలో ప్రతి 45 రోజులకు ఒక ఎయిర్‌పోర్ట్ ప్రారంభిస్తున్నామని కేంద్ర‌మంత్రి రామ్మోహన్ అన్నారు. విశాఖలో ఓ ప్రోగ్రామ్‌లో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే IND అత్యంత సురక్షితమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్‌గా అవతరించిందని చెప్పారు. APలోని, TGలోని పలు కొత్త విమానాశ్రయాల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. NDA అధికారంలోకి వచ్చేనాటికి తక్కువగా ఉన్న ఎయిర్‌పోర్టుల సంఖ్య 167కి చేరిందని చెప్పారు.

News March 21, 2026

TTD ఆలయాల ఆధునీకరణకు CM దిశానిర్దేశం

image

CM చంద్రబాబు సూచనలతో టీటీడీ ఆలయాలను ఆధునాతన ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. AI ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సమీక్షించిన సీఎం, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సేవలను మెరుగుపరచాలన్నారు. లడ్డూ తయారీ, అన్నదానం, ప్రాణదానం సేవలను నిర్వహించాలని పేర్కొన్నారు. అలాగే సేవకులకు శిక్షణ ఇచ్చి అన్ని ఆలయాల్లో సేవలను విస్తరించాలని CM సూచించారు.

News March 21, 2026

వరంగల్: రంజాన్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత

image

రంజాన్ పర్వదినం సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ హన్మకొండలోని బొక్కలగడ్డ, పోతననగర్ ఈద్గాలను సందర్శించారు. ప్రార్థనలు సజావుగా సాగేందుకు భద్రతా ఏర్పాట్లను ఏఎస్పీ శుభం, ఏసీపీ నర్సింహారావుతో కలిసి పరిశీలించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఆంక్షలు విధించగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గస్తీ, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు.