News October 7, 2025
మందసలో వివాహిత సూసైడ్

మందస(M) మఖరజోలకు చెందిన కూర్మమ్మ (22) సోమవారం సూసైడ్ చేసుకుంది. కడుపునొప్పి తాళలేక జీడీ తోటల్లో ఓ చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈమె భర్త ఖతర్‌లో పని చేస్తున్నాడు. ఇటీవల కడుపునొప్పిగా ఉందని కన్నవారి ఇంటికి రావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించారు. ఇంతలోనే కూరమ్మ సూసైడ్ చేసుకోవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. తల్లి పద్మ ఫిర్యాదుతో కాశీబుగ్గ ఎస్సై నరసింహమూర్తి కేసు నమోదు చేశారు.
Similar News
News October 7, 2025
SKLM: పిడుగుపాటుతో ముగ్గురు మృతి.. మంత్రి దిగ్భ్రాంతి

మెలియాపుట్టి మండలం గంగరాజపురం క్వారీ వద్ద పిడుగుపాటుతో ముగ్గురు కూలీలు మృతి చెందడం పట్ల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. పిడుగుపాటుతో మృతి చెందడం చాలా దురదృష్టకరమన్నారు. అస్వస్థతకు గురై టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు.
News October 7, 2025
మెళియాపుట్టి: పిడుగుపాటు ఘటనలో మృతులు వీరే

మెలియాపుట్టి మండలంలోని జంగాలపాడు గ్రానైట్ క్వారీ వద్ద మంగళవారం పిడుగుపాటుకు గురై మృతిచెందిన కార్మికుల వివరాలు ఇలా ఉన్నాయి. జ్ఞానేశ్వర్(రాజస్థాన్), పింటు(మధ్యప్రదేశ్), కుమార్(క్వారీ మేనేజరు,బీహార్) ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు. వీరు గత కొన్నాళ్లుగా క్వారీలో కార్మికులుగా ఉన్నారు.
News October 7, 2025
విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో మంత్రులు

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతరలో కీలక ఘట్టమైన సిరిమానోత్సవం మంగళవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. వేకువజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనార్థం భారీగా తరలి వచ్చి ఆలయ ప్రాంగణంలో బారులు తీశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే గొండు శంకర్, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, అతిథి గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.