News October 7, 2025
VKB: స్థానిక పోరుపై తీవ్ర ఉత్కంఠ.!

SEC స్థానిక పోరుకు షెడ్యూల్ విడుదల చేసింది. BCలకు 42% రిజర్వేషన్లపై ప్రభుత్వ GOను సవాల్ చేస్తూ కొందరు హై, సుప్రీం కోర్టులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నిన్న సుప్రీం కోర్టులో రిజర్వేషన్లపై విచారణ జరిపేందుకు న్యాయమూర్తులు నిరాకరించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేశారు. దీనిపై హైకోర్టుకు వెళ్లాలని సూచించారు. దీంతో VKBలోని ఆశావహులు హైకోర్టు తీర్పు కోసం ఉత్కంఠతో చూస్తున్నారు.
Similar News
News March 15, 2026
TVKకు 80 సీట్లు, Dy.CM పదవి.. బీజేపీ ఆఫర్?

TN అసెంబ్లీ ఎన్నికల్లో BJPతో పొత్తు ఉండదని TVK చీఫ్ విజయ్ పలుమార్లు <<19381860>>చెప్పినా<<>> ఊహాగానాలు ఆగడం లేదు. తాజాగా TVKకు 80 సీట్లు, Dy.CM పదవిని బీజేపీ ఆఫర్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. చర్చలు తుదిదశకు చేరుకున్నాయని తెలిపాయి. CM పోస్టుపై విజయ్ దృష్టిపెట్టారని, దీనిపైనే సందిగ్ధత ఉందని పేర్కొన్నాయి. ఈ చర్చల్లో ఓ రాష్ట్ర Dy.CM కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
News March 15, 2026
రేపటి నుంచి మ.12.30 గం. వరకే స్కూళ్లు

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఏపీలో 7.45AM నుంచి 12.30PM వరకు తరగతులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. అటు తెలంగాణలో 8AM నుంచి 12.30PM వరకు తరగతులు ఉంటాయి. రెండు రాష్ట్రాల్లో స్కూల్ ముగిశాక మధ్యాహ్న భోజనం పెట్టి పిల్లలను ఇంటికి పంపించనున్నారు.
News March 15, 2026
పదో తరగతి విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖి

రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. పుట్టపర్తి(M) చిన్నపల్లి జడ్పీ హైస్కూల్‌ను సందర్శించి, పరీక్షలు రాయనున్న విద్యార్థులతో ఆయన మాట్లాడి ధైర్యం చెప్పారు. పరీక్షలు నమ్మకంగా రాయాలని సూచిస్తూ.. చదువుకు ఉపయోగపడే పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో డీఈవో క్రిష్టప్ప, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.


