News October 7, 2025

కొత్తగూడెం: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ESI అమలు

image

సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు ఈఎస్‌ఐ (ESI) పథకాన్ని అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టుగా కొత్తగూడెం కార్పొరేట్, ఏరియాను ఎంచుకున్నారు. ఈ మేరకు సోమవారం యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో కాంట్రాక్ట్‌ కార్మికుల ఎన్నో ఏళ్ల కల నెరవేరినట్లయింది.

Similar News

News March 13, 2026

గద్వాల: ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి – డీఈవో

image

పదో తరగతి విద్యార్థులు ఎలాంటి భయాందోళనలు లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని జిల్లా విద్యాశాఖ అధికారిణి కె. విజయలక్ష్మి సూచించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఆమె విద్యార్థులకు ధైర్యం చెప్పారు. పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కోరారు.

News March 13, 2026

రాజీకి అవకాశం ఉన్న కేసులను ముందుగా గుర్తించాలి: VZM SP

image

జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో రేపు నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ పోలీసు అధికారులను శుక్రవారం ఆదేశించారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను ముందుగా గుర్తించి ఇరు వర్గాలతో చర్చలు జరిపి పరిష్కారం చేయాలని సూచించారు. ఇందుకోసం పోలీస్ స్టేషన్ల స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని తెలిపారు.

News March 13, 2026

ఘనంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం: జేసీ

image

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ-PM కిసాన్ నిధులు విడుదల కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. జిల్లాలోని 6 నియోజకవర్గాల పరిధిలో పెనుకొండ, అమరాపురం, బత్తలపల్లి, లేపాక్షి, బుక్కపట్నం, నల్లచెరువు కేంద్రాలలో స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగిందన్నారు. రైతులు ఈ నిధులను సాగు ఖర్చులకు వినియోగించుకోవాలని జేసీ తెలిపారు.