News October 7, 2025
నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

నేషనల్ హౌసింగ్ బ్యాంక్ 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 21వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఉన్నాయి పోస్టును బట్టి CA, MBA, PGDM, PGDBM, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ఫీజు రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175. వెబ్‌సైట్: https://www.nhb.org.in/
Similar News
News October 7, 2025
ఎన్ని ఓట్లు తొలగించారో చెప్పే ధైర్యం CECకి లేదు: కాంగ్రెస్

బిహార్‌లో ఎన్ని నాన్ సిటిజెన్స్ ఓట్లను తొలగించారో వెల్లడించే ధైర్యం CECకి లేదని CONG ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ మండిపడ్డారు. ‘SIRలో పౌరులు కాని వ్యక్తుల పేరిట ఉన్న ఓట్లను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా తొలగించిన ఓట్ల లెక్కల్ని దేశ ప్రజలకు తెలిసేలా బయటపెట్టాలి. ఎన్నికల సంఘం ఆ పని మాత్రం చేయడం లేదు’ అని Xలో విమర్శించారు. కాగా బిహార్ SIRపై తమ అనాలసిస్‌ను జైరామ్ రమేశ్ Xలో పోస్టు చేశారు.
News October 7, 2025
పైడితల్లి అమ్మవారి దివ్యగాథ

విజయనగరానికి రాజైన తన సోదరుడు విజయరామరాజును బొబ్బిలి యుద్ధానికి వెళ్లొద్దని పైడితల్లమ్మ ముందే చెబుతారు. కానీ ఆమె మాట వినక రాజు యుద్ధానికెళ్లి మరణిస్తాడు. ఈ కబురు తెలిసి అమ్మవారు కూడా తనువు చాలిస్తారు. అదే రాత్రి పతివాడ అప్పలనాయుడు కలలోకి వచ్చిన అమ్మవారు తన ప్రతిరూపాలు లభించే స్థలాన్ని సూచిస్తారు. వాటిని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించమని చెబుతారు. ఆ విగ్రహాలు నిజంగానే లభ్యమవ్వగా, ఆలయాన్ని నిర్మించారు.
News October 7, 2025
టుడే అప్డేట్స్

* వాల్మీకి జయంతి.. చిత్రపటానికి పూలమాల వేసిన సీఎం చంద్రబాబు
* జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు అభ్యర్థి ఎంపికపై సీఎం రేవంత్ జూమ్ మీటింగ్.. పాల్గొన్న మీనాక్షి నటరాజన్, మహేశ్ గౌడ్
* మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్‌తో ఫోన్‌లో మాట్లాడిన TPCC చీఫ్ మహేశ్.. సంయమనం పాటించాలని సూచన
* మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు