News October 7, 2025

KNR: హైకోర్టు తీర్పుపై ఆశావహుల్లో ఉత్కంఠ..!

image

SEC స్థానిక పోరుకు షెడ్యూల్ విడుదల చేసింది. BCలకు 42% రిజర్వేషన్లపై ప్రభుత్వ GOను సవాల్ చేస్తూ కొందరు హై, సుప్రీం కోర్టులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నిన్న సుప్రీం కోర్టులో రిజర్వేషన్లపై విచారణ జరిపేందుకు న్యాయమూర్తులు నిరాకరించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేశారు. దీనిపై హైకోర్టుకు వెళ్లాలని సూచించారు. దీంతో ఉమ్మడి KNRలోని ఆశావహులు హైకోర్టు తీర్పు కోసం ఉత్కంఠతో చూస్తున్నారు.

Similar News

News March 30, 2026

నేటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

image

తిరుమలలో ఈరోజు నుంచి ఏప్రిల్ 1 వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. వసంతమండపంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ మూడురోజులూ స్వామివారిని మాడవీధుల్లో ఊరేగిస్తారు. రేపు ఉ.8-10 మధ్య స్వర్ణరథంపై శ్రీవారి తిరువీధిని చూసేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈ మూడు రోజులూ కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలతో పాటు రేపటి అష్టదళ పాద పద్మారాధన సేవను TTD రద్దు చేసింది.

News March 30, 2026

కృష్ణా జిల్లాలో 133 మందిపై బైండోవర్ కేసులు

image

కృష్ణా జిల్లాలో 133 మంది పందెం రాయుళ్లపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల కారణంగా బెట్టింగ్లను అరికట్టేందుకు గాను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. గతంలో పలు రకాల బెట్టింగ్లకు పాల్పడిన 133 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిపై బైండోవర్ కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇచ్చారు.

News March 30, 2026

ఐదు గ్యారెంటీలతో అస్సాం బరిలో కాంగ్రెస్

image

ఐదు గ్యారెంటీల మేనిఫెస్టోతో కాంగ్రెస్ అస్సాం ఎన్నికల బరిలోకి దిగింది. మహిళలకు నెలవారీ నగదు బదిలీతో పాటు వ్యాపార విస్తరణకు ₹50వేల సాయం చేస్తాయని ప్రకటించింది. సీనియర్ సిటిజన్లకు నెలకు ₹1,250 చొప్పున పెన్షన్లు, 100 రోజుల్లోనే సింగర్ జుబిన్ గార్గ్ మృతి కేసులో న్యాయం, ₹25లక్షల క్యాష్‌లెస్ హెల్త్ ఇన్సూరెన్స్, 10లక్షల మందికి శాశ్వత భూపట్టాలను ఇప్పిస్తామని హామీ ఇచ్చింది.