News October 7, 2025
కేయూలో ఎట్టకేలకు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు..?

కేయూలోని వివిధ విభాగాల్లో 2010లో నియామకమైన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఎట్టకేలకు పదోన్నతులు కల్పిస్తూ కేయూ పాలకమండలి సమావేశం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరి నియామకాలను గత పాలకమండలిలో ఆమోదించినా పెండింగ్‌లో ఉండిపోయింది. తాజా సమావేశంలో పదోన్నతి అంశం చర్చకు వచ్చి పదోన్నతులకు చివరికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. త్వరలోనే వీరికి క్యాస్ పదోన్నతులు లభించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Similar News
News March 5, 2026
ఆసిఫాబాద్ జిల్లాలో విద్యుత్ సరఫరా బలోపేతం: ఎస్ఈ

ASF జిల్లాలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తున్నామని విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తమ్ జాడే తెలిపారు. జిల్లాకు మంజూరైన 14 ట్రాన్స్‌ఫార్మర్లలో 7 ఇప్పటికే ఏర్పాటు చేశామని చెప్పారు. ఓవర్‌లోడ్ నియంత్రణకు ఏబీ స్వీచ్‌లు అమర్చుతున్నామని పేర్కొన్నారు. దహెగాం, గుండాయపేట్, రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో 33 కేవీ లైన్లకు కవర్ కండక్టర్లు అమర్చి 70 కి.మీ కేబుల్ వేసినట్లు తెలిపారు.
News March 5, 2026
కృష్ణా జిల్లాలో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా

కృష్ణా జిల్లాలో రేషన్ మాఫియా చెలరేగిపోతోంది. ఎమ్మెల్యేలకి నెలకు రూ.15-20 లక్షలు ముట్టజెప్పి వ్యాపారం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గానికి 300 టన్నులకు పైగా పేదల బియ్యం నల్ల బజార్‌కి వెళ్తున్నాయి. స్థానిక మిల్లులోనే పాలిష్ పట్టి సాధారణ బియ్యంలా కాకినాడ పోర్టుకి తరలిస్తున్నట్లు సమాచారం. MTM, పామర్రు,పెనమలూరు కేంద్రాలుగా రేషన్ మాఫియా రెచ్చిపోతున్నా.. అధికారుల దాడులు మమ అనిపించేలా ఉంటున్నాయి.
News March 5, 2026
దేశ భవిష్యత్తుకు ‘బరువు’ భయం!

<<19300696>>బాలల ఒబెసిటీ<<>> దేశ భవిష్యత్తును కలవరపెడుతోంది. ఇది కేవలం ఆరోగ్య సమస్యే కాదు మున్ముందు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది. పిల్లలు బరువు పెరగడం కంటిన్యూ అయితే దీర్ఘకాలిక వ్యాధులొచ్చి హెల్త్‌కేర్ ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా భవిష్యత్ వర్క్‌ఫోర్స్ బలహీనపడుతుంది. అందుకే బడుల్లో వ్యాయామం తప్పనిసరి చేయాలి. స్కూళ్లు, ప్రభుత్వం కలిసి ఊబకాయంపై చైతన్యం తేవాలి. ఇంట్లో సమతుల ఆహారం అందేలా తల్లిదండ్రులు చూడాలి.


