News October 7, 2025
కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఉద్యోగ విరమణ ఐదేళ్లు పెంపు

కేయూలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నవారి ఉద్యోగ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వరకు పెంచుతూ ఆమోదించింది. రెగ్యులర్ ఆచార్యులకు మాదిరిగానే వీరికి ఉద్యోగ విరమణ ఉండనుంది. టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు మరణిస్తే అంత్యక్రియల ఖర్చు రూ.20వేల నుంచి రూ.30వేలకు పెంచుతూ ఆమోదించింది.
Similar News
News March 12, 2026
రోడ్లు-భవనాల శాఖ పురోగతిపై సీఎం సమీక్ష

తెలంగాణలోని ప్రధాన జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని CM రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లోకి భారీ వాహనాలు వెళ్లకుండా నియంత్రించడంతో పాటు సరకు రవాణా వాహనాలు వేగంగా వెళ్లేందుకు రింగు రోడ్లు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి కోమటి రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News March 12, 2026
మహబూబాబాద్ జిల్లాలో 45 పరీక్షా కేంద్రాలు

పదో తరగతి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు మహబూబాబాద్ జిల్లాలో అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. విద్యార్థుల కోసం విషయ నిపుణులతో అవగాహన కార్యక్రమం, రివిజన్ తరగతులు నిర్వహిస్తున్నారు. పరీక్ష కోసం జిల్లా వ్యాప్తంగా 45 కేంద్రాలను ఏర్పాటు చేయగా..8157 మంది పరీక్షలు రాయనున్నారు. ఇందులో బాలురు 4156 మంది, బాలికలు 4001 మంది ఉన్నారు. ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 15 వరకు పరీక్షలు జరగనున్నాయి.
News March 12, 2026
కడప: ‘సీఐ అశోక్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు’

కడప జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో పనిచేసిన సీఐ అశోక్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భూమి సెటిల్‌మెంట్లు, ఇతర అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఆయనపై ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై ఆధారాలు లభ్యమవ్వడంతో సీఐ అశోక్‌రెడ్డిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. కాగా ఆయన గత రెండేళ్లుగా వీఆర్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.


