News October 7, 2025
HYD: లవ్ ఫెయిల్.. యువకుడి సూసైడ్

HYD మూసాపేటలో నిన్న <<17932066>>కమలేశ్ సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. మహారాష్ట్ర వాసి కమలేశ్ 3 నెలల క్రితం HYD వచ్చాడు. కాగా తన సొంతూరుకు చెందిన ఓ యువతిని కొన్నాళ్లుగా అతడు లవ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో చేతులను బ్లేడ్‌తో కోసుకున్న ఫొటోలను యువతికి వాట్సాప్‌లో పంపి, సెల్ఫీ వీడియో తీసుకుంటూ గదిలో ఉరేసుకున్నాడు. అయితే అతడి ప్రేమికురాలు సైతం సూసైడ్‌కు యత్నించినట్లు తెలుస్తోంది.
Similar News
News October 7, 2025
NZB: ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన వీరుడు కొమురం భీం: కల్వకుంట్ల కవిత

జల్, జంగల్, జమీన్ అనే గొప్ప సంకల్పంతో ఆదివాసీల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన వీరుడు కొమురం భీం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆయన నినాదం, పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం సాగిందన్నారు. అలాంటి మహానీయుడి త్యాగాలను ఆయన వర్థంతి సందర్భంగా మరోసారి స్మరించుకుందామన్నారు. ఆయనకు నివాళి అర్పిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.
News October 7, 2025
జూబ్లీహిల్స్ బరిలో టీడీపీ?

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి టీడీపీ కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. బీజేపీ పొత్తుకు ఓకే చెబితే నందమూరి హరికృష్ణ కూతురు, జూనియర్ ఎన్టీఆర్ సోదరి సుహాసినిని అభ్యర్థిగా నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా నేడు సాయంత్రం తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు ఉండవల్లి నివాసంలో భేటీ కానున్నారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ నేతలతో చంద్రబాబు ఈ ప్రతిపాదన చేయనున్నారు.
News October 7, 2025
పీలేరులో పతాకస్థాయికి MLA పీఏ భూకబ్జాలు: YCP

పీలేరు <<17935208>>MLA కిషోర్ కుమార్ పీఏ<<>> సత్య తన భూమిని కబ్జా చేశారని అనురాధ అనే మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరవర్గం భారీగా కబ్జాలు చేస్తోంది. పీలేరులో ఎమ్మెల్యే పీఏ భూకబ్జాలు పతాకస్థాయికి చేరాయి. ఈ 15 నెలల్లో ఇసుక, లిక్కర్‌లో దోచుకుంది మీ వాళ్లకి సరిపోలేదా చంద్రబాబు?’ అంటూ YCP ట్వీట్ చేసింది.