News October 7, 2025
వరంగల్: స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠ

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. సోమవారం సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో ఉమ్మడి వరంగల్ ఆశావహుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఐతే రేపు(బుధవారం) వెలువడే హైకోర్టు తీర్పు కూడా జీవో నంబర్ 9 చట్టానికి లోబడి లేనందున ఎన్నికలు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Similar News
News April 2, 2026
సిరిసిల్ల: ఘనంగా జాతీయ 108 ఈఎంటీ దినోత్సవం

జాతీయ ఈఎంటీ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, డీయంఈ డాక్టర్ బీ.ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లాలోని 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌లు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బంది సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్, ఆర్ఎంఓ డాక్టర్ సుమన్, 108 జిల్లా మేనేజర్ సావనపల్లి అరుణ్ కుమార్, 108 సిబ్బంది అనీల్ తదితరులు ఉన్నారు.
News April 2, 2026
హై కొలెస్ట్రాల్‌కు లక్షణాలు ఉంటాయా?

హై కొలెస్ట్రాల్ బయటకు కనిపించని ప్రమాదం. ప్రత్యేకమైన లక్షణాలేమీ ఉండవు. కానీ మన శరీరంలో కొన్ని మార్పులు గమనించొచ్చు. కళ్ల దగ్గర పసుపు రంగు మచ్చలు, కొన్ని భాగాల్లో చర్మం కింద కొవ్వు గడ్డలు, కంటి పాప చుట్టూ తెల్లటి రింగ్ కనిపిస్తే అలర్ట్ అవ్వాలి. ఛాతీలో నొప్పి, నీరసం, ఆయాసం వచ్చినా నిర్లక్ష్యం చేయొద్దు. ఇవన్నీ కేవలం సూచనలు మాత్రమే. బ్లడ్ టెస్ట్ చేయించుకొని డాక్టర్‌ని సంప్రదించడం చాలా ముఖ్యం.
News April 2, 2026
గౌరు ఇంట పెళ్లి సందడి.. హాజరైన సీఎం

నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కుమారుడి వివాహ వేడుకకు సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమార్తెతో ఈ వివాహం జరిగింది. నూతన వధూవరులు జనార్దన్ రెడ్డి-సనాతనిని ముఖ్యమంత్రి ఆశీర్వదించారు. ఈ శుభకార్యానికి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.


