News October 7, 2025

కడపలో యువతి ఆత్మహత్యాయత్నం

image

కడపలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. నంద్యాల జిల్లాకు చెందిన యువతి రిమ్స్ డెంటల్ కాలేజీలో BDS ఫస్ట్ ఇయర్ చదువుతోంది. నిన్న ఉదయం 11 గంటలకు ఆమె ఎగ్జాం రాయాల్సి ఉంది. సరిగా పరీక్ష రాయలేనని భయాందోళనకు గురైంది. నిన్న ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత హాస్టల్ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకేసింది. వెంటనే రిమ్స్ క్యాజువాలిటీ వార్డుకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Similar News

News October 7, 2025

కొండాపురంలో అత్యధిక వర్షం

image

కొండాపురం మండలంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో అత్యధికంగా ఇక్కడే 93.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా బ్రహ్మంగారి మఠం, కోడూరులో 4.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇటీవల కురిసిన వర్షాలు కొన్ని పంటలకు మేలు చేకూర్చగా.. మరికొన్ని పంటలకు తీవ్ర నష్టం జరిగింది. మొక్కజొన్న, పత్తి సాగు చేసిన రైతులు నష్టపోయారు.

News October 7, 2025

పులివెందులలో MP అవినాశ్ ప్రజా దర్బార్

image

కడప పార్లమెంట్ సభ్యుడు YS అవినాశ్‌రెడ్డి సోమవారం తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తమ సమస్యలను ఎంపీకి తెలియజేశారు. ప్రజల ఆవేదనను ఆలకించిన అవినాశ్‌రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం ముఖ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్ వీరివెంట ఉన్నారు.

News October 6, 2025

కడప: వీళ్లకు నామినేటెడ్ పదవులు లేనట్లేనా?

image

కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటినా కడప జిల్లాలోని పలువురు నేతలకు నామినేటెడ్ పదవులు లభించలేదు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు టికెట్లు ఆశించి భంగపడ్డ భూపేశ్ రెడ్డి, ఉక్కు ప్రవీణ్‌లకు ప్రభుత్వం వచ్చాక నామినేటెడ్ పదవులు వస్తాయని వారి వర్గీయులు ఆశించారు. అయినా వీరికి ఏ ఒక్క పదవి దక్కలేదు. ఇక బద్వేల్, పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్‌లు రితేశ్ రెడ్డి, బీటెక్ రవిలు కూడా పదవులు ఆశించిన వారిలో ఉన్నారు.