News October 7, 2025
BREAKING.. జనగామ: ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

గడ్డి మందు తాగి ప్రేమజంట ఆత్మహత్యయత్నానికి పాల్పడిన జనగామ(D) స్టేషన్ ఘన్‌పూర్ మండలంలో సోమవారం జరిగింది. ఈ ఘటనలో ప్రియుడు అన్వేశ్(26) మృతి చెందగా.. ప్రియురాలు పావని ఎంజీఎంలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలానికి చెందిన ఓ యువతిని వివాహం చేసుకోవడానికి పరిస్థితులు అనుకుంలించక పోవడంతో ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Similar News
News October 7, 2025
వాల్మీకి గురించి మనకు తెలియని మరో కథ

ఓ బోయవాడు క్రౌంచపక్షి జంటలో ఒకదాన్ని చంపడం చూసి వాల్మీకి చలించిపోతాడు. అసంకల్పితంగా ఓ శ్లోకాన్ని పలుకుతాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై.. ఆ శ్లోకమే రామాయణానికి మూలం అవుతుందని చెబుతాడు. పాత్రల సంభాషణలు, మనోగతాలు స్పష్టంగా తెలుసుకునే వరం ఇస్తాడు. ఆ వరం మేరకు వాల్మీకి ధ్యానంలో కూర్చొంటాడు. ఎలాంటి కల్పితం లేకుండా 24K శ్లోకాలతో మహాకావ్యాన్ని రచించి, లోకానికి ఆదికావ్యాన్ని అందించాడు. నేడు ఆయన జయంతి.
News October 7, 2025
డ్రోన్ సిటీకి ప్రధానితో శంకుస్థాపన

ఈ నెల 16న కర్నూలు పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ డ్రోన్ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. డిసెంబరులో డ్రోన్ షోను నిర్వహించాలని సూచించారు. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు కలిగే లబ్ధిని వివరించేందుకు ప్రధాని జిల్లా పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే.
News October 7, 2025
PM మోదీ ఆసక్తికర పోస్ట్

తాను 2001లో ఇదే రోజు మొదటిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘నా తోటి భారతీయుల నిరంతర ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. నేను ప్రభుత్వ అధిపతిగా 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాను. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి, దేశ పురోగతికి తోడ్పడటానికి నేను నిరంతరం ప్రయత్నిస్తున్నాను. మీ మద్దతుకు కృతజ్ఞతలు’ అని తన ఫొటోలను షేర్ చేశారు.