News April 7, 2024
లబ్ధి పొంది ఇతరులకు ఓటేస్తే రాజ్యాంగాన్ని అవమానించినట్లే: MLA
కర్ణాటక ఎమ్మెల్యే రాజు కాగే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘గ్యారంటీ స్కీం పొందిన వారు ఇతరులకు ఓటు వేస్తే రాజ్యాంగాన్ని అవమానించినట్లే, ప్రజాస్వామ్యాన్ని ఊచకోత కోసినట్లే..’ అని ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. పదేళ్లలో ప్రధాని మోదీ పేదలు, రైతుల గురించి నోరు విప్పలేదని, బీజేపీకి ఓటు వేయొద్దని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News February 5, 2025
IBPS పీవో స్కోర్ కార్డులు విడుదల
IBPS పీవో మెయిన్స్ స్కోర్ కార్డులు వచ్చేశాయి. గతేడాది NOVలో ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల ఫలితాలను జనవరి 31న రిలీజ్ చేయగా, తాజాగా స్కోర్ కార్డులను అందుబాటులో ఉంచారు. <
News February 5, 2025
మద్యం అక్రమాలపై ‘సిట్’ ఏర్పాటు
AP: రాష్ట్రంలో మద్యం కుంభకోణంపై ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో SIT (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను ఏర్పాటు చేసింది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు జరిగిన విక్రయాలపై సిట్ దర్యాప్తు చేయనుంది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దీనికి నేతృత్వం వహించనున్నారు. SITకు అవసరమైన సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను ఆదేశించింది.
News February 5, 2025
భారతీయులకు సంకెళ్లు వేసి తెచ్చారా?.. నిజమిదే!
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని ట్రంప్ ప్రభుత్వం యుద్ధ విమానంలో ఇండియాకు పంపిన విషయం తెలిసిందే. వీరికి విమానంలో సంకెళ్లు వేసి తీసుకొచ్చారన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో నిజం లేదు. అవి గ్వాటెమాలా, ఈక్వెడార్, కొలంబియా దేశాలకు చెందిన అక్రమ వలసదారులవి. ఈ విషయం తెలియక కాంగ్రెస్.. భారతీయులను అమెరికా నేరస్థులుగా పంపడం అవమానకరమని, చూడలేకపోతున్నామని వ్యాఖ్యానించింది.