News October 7, 2025
‘OG’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?

పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా ఈ నెల 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో పవర్ స్టార్ లుక్స్, యాక్షన్ సీన్స్, ఎలివేషన్లు ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు మూవీ టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News October 7, 2025
నాణ్యతా తనిఖీల్లో ఇంత నిర్లక్ష్యమా?

దగ్గు మందుకు 15 మంది చిన్నారులు బలి కావడం దేశంలో నాణ్యతా ప్రమాణాలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. 2022లోనూ మన దేశం నుంచి ఎగుమతైన మందుల వల్ల గాంబియాలో డజనుకు పైగా పిల్లలు మరణించారు. అయినా వాటి నుంచి ఎందుకు పాఠాలు నేర్చుకోలేదని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. ఔషధ తయారీలో వ్యవస్థాపరమైన లోపాలు అందరికీ ముప్పేనని విమర్శిస్తున్నారు. కాగా ఈ ఘటనపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరపాలని సుప్రీం కోర్టులో పిల్ దాఖలైంది.
News October 7, 2025
వాల్మీకి గురించి మనకు తెలియని మరో కథ

ఓ బోయవాడు క్రౌంచపక్షి జంటలో ఒకదాన్ని చంపడం చూసి వాల్మీకి చలించిపోతాడు. అసంకల్పితంగా ఓ శ్లోకాన్ని పలుకుతాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై.. ఆ శ్లోకమే రామాయణానికి మూలం అవుతుందని చెబుతాడు. పాత్రల సంభాషణలు, మనోగతాలు స్పష్టంగా తెలుసుకునే వరం ఇస్తాడు. ఆ వరం మేరకు వాల్మీకి ధ్యానంలో కూర్చొంటాడు. ఎలాంటి కల్పితం లేకుండా 24K శ్లోకాలతో మహాకావ్యాన్ని రచించి, లోకానికి ఆదికావ్యాన్ని అందించాడు. నేడు ఆయన జయంతి.
News October 7, 2025
PM మోదీ ఆసక్తికర పోస్ట్

తాను 2001లో ఇదే రోజు మొదటిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘నా తోటి భారతీయుల నిరంతర ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. నేను ప్రభుత్వ అధిపతిగా 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాను. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి, దేశ పురోగతికి తోడ్పడటానికి నేను నిరంతరం ప్రయత్నిస్తున్నాను. మీ మద్దతుకు కృతజ్ఞతలు’ అని తన ఫొటోలను షేర్ చేశారు.