News October 7, 2025
ఈనెల 9న వైఎస్ జగన్ రోడ్ షో?

ఈనెల 9న వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా పర్యటన సందర్భంగా 7నియోజకవర్గాల మీదుగా రోడ్ షో నిర్వహించే అవకాశం ఉందని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. స్టీల్ ప్లాంట్, షుగర్ ఫ్యాక్టరీ, బల్క్‌డ్రగ్ పార్క్ బాధితులను జగన్ కలవనున్నారని చెప్పారు. ఆయన పర్యటనకు సంబంధించిన సన్నాహక సమావేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ ఎప్పుడూ వ్యతిరేకమని మరోసారి స్పష్టం చేశారు.
Similar News
News March 21, 2026
పోలవరం: పులి కదలికలు ఇక్కడే ఉన్నాయి..

పోలవరం జిల్లాలో పెద్దపులి హల్ చల్ కొనసాగుతుంది. అడ్డతీగల, ఏలేశ్వరం మండలాల సరిహద్దున డి.కృష్ణవరం అటవీ ప్రాంతంలో పులి ఉందని సబ్ DFO సుబ్బారెడ్డి శనివారం మీడియాకు తెలిపారు. ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఏలేరు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వద్ద పులి కదలికలను గుర్తించామని వెల్లడించారు. పరిసర గ్రామాల వారు అప్రమత్తంగా ఉండాలన్నారు. రక్షిత అటవీ ప్రాంతాల్లోకి ఒంటరిగా వెళ్ళవద్దని హెచ్చరించారు.
News March 21, 2026
గుంటుపల్లి ‘రైజ్’కు నీతి ఆయోగ్ గుర్తింపు: కలెక్టర్

ఇబ్రహీంపట్నం (M) గుంటుపల్లిలోని రూరల్ ఇన్నోవేషన్స్ ఇంక్యుబేషన్, స్కిల్లింగ్&ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్‌కు నీతి ఆయోగ్ గుర్తింపు లభించిందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి ఆకాంక్ష అని అన్నారు. ఈ కేంద్రం ద్వారా మహిళల్లో నైపుణ్యాలను పెంచి, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.
News March 21, 2026
ముస్లింలు ఆర్థికంగా ఎదగాలి: అనంతపురం ఎంపీ

అనంతపురం అశోక్ నగర్ ఈద్గా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వారిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఎంపీ మాట్లాడుతూ.. ముస్లిం సోదరులంతా విద్యావంతులై, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.


