News October 7, 2025
WGL: హైకోర్టు తీర్పు కొంత మోదం.. కొంత ఖేదం..!

ఉమ్మడి జిల్లాలో హైకోర్టు తీర్పు కొంత మోదం.. కొంత ఖేదం కలిగించే దిశగా వినిపిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటించింది. దాదాపు ముఖ్యమైన ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అధికార పార్టీ నాయకులకు రిజర్వేషన్ పెంపుతో అవకాశం దక్కలేదు. దీంతో తీర్పు వ్యతిరేకంగా వస్తే తమకే మంచిదని భావిస్తున్నారు. రిజర్వేషన్లు పునరుద్ధరిస్తే బరిలో ఉండొచ్చట.
Similar News
News October 7, 2025
వరంగల్: ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ సత్య శారద మంగళవారం ఎనుమాముల మార్కెట్ యార్డులో పరిశీలించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్ హాళ్లు, స్ట్రాంగ్ రూమ్‌లు, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, నీటి, టాయిలెట్ సౌకర్యాలను పరిశీలించారు. కౌంటింగ్ హాళ్లలో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
News October 6, 2025
బ్యాంకు వివరాల పరిశీలన: వరంగల్ డీఐఈఓ

ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలను వరంగల్ ఇంటర్మీడియేట్ కార్యాలయంలో పూర్తి స్థాయి తనిఖీ నిర్వహించి ఆమోదించనున్నట్లు డీఐఈఓ శ్రీధర్ సుమన్ తెలిపారు. డీఐఈఓ ఆమోదం పొందిన సిబ్బందికి ప్రత్యేక యూనిక్ ఐడీ జారీ చేయనున్నారని, వీటి కోసం అన్ని వివరాలు కచ్చితంగా నమోదు చేయాలన్నారు.
News October 6, 2025
రేపు ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SGFI) ఆధ్వర్యంలో ఈనెల 7న హన్మకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం(JNS)లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్లు క్రీడా పోటీల నిర్వహణ జిల్లా కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారు అండర్-19 రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. పూర్తి వివరాలకు 98488 76765ను సంప్రదించాలని కోరారు.