News October 7, 2025

నల్లపాడు పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

image

నల్లపాడు పోలీసులపై హైకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ యువతి అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు పూర్తి చేసినప్పటికీ, అభియోగపత్రం కోర్టులో దాఖలు చేయకపోవడంపై జస్టిస్ బట్టు దేవానంద్ ప్రశ్నలు సంధించారు. మృతురాలు ఆసుపత్రికి చేరుకునేలోపు మరణించిందని చెబుతూనే, ఆమె వాంగ్మూలం ఇచ్చిందని చెప్పడం విచిత్రమని వ్యాఖ్యానించారు. కేసు సీబీఐకి బదలాయించడం సముచితమని కోర్టు పేర్కొంది.

Similar News

News March 16, 2026

గుంతకల్: కూతురు పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లి తల్లి మృతి

image

గుంతకల్లు మండలం పాత కొత్త చెరువు సమీపంలో సోమవారం బైక్ బోల్తా పడి అక్బర్ బీ మృతి చెందింది. గుత్తికి చెందిన అక్బర్ బీ తన కుమార్తె పెళ్లి పత్రికలు పంచడానికి మేనల్లుడు మహబూబ్ బాషాతో కలిసి బైక్‌పై గుంతకల్లుకు వెళ్లింది. అక్కడ బంధువులకు పత్రికలు పంచి గుత్తికి ప్రయాణమయ్యారు. పాత కొత్త చెరువు సమీపంలో బైక్ బోల్తా పడింది. ఇద్దరూ గాయపడ్డారు. అక్బర్ బీ కర్నూలుకు తరలిస్తుండగా మృతి చెందింది.

News March 16, 2026

నల్గొండ: దివ్యాంగుల కోసం ప్రతి నెలాఖరున ‘ప్రత్యేక ప్రజావాణి’

image

దివ్యాంగులు, వృద్ధుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల చివరి శనివారం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ నెల 28న దీన్ని ప్రారంభిస్తున్నామని, దీనికి అదనంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రంజాన్ తోఫా పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

News March 16, 2026

కడప జిల్లాలో 16 మంది ఎమ్మార్వోలు బదిలీ

image

ప్రొద్దుటూరు ఎమ్మార్వో గంగయ్య కడప కలెక్టరేట్ ఏవోగా బదిలీ అయ్యారు. ప్రొద్దుటూరుకు కడప కలెక్టరేట్ AO విజయకుమార్ రానున్నారు. ఈ మేరకు సోమవారం జిల్లాలోని 16 మంది ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. బద్వేల్, బి.కోడూరు, చెన్నూరు, పులివెందుల, సింహాద్రిపురం, వేంపల్లె, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, రాజంపేట, కాశినాయన, నందలూరు, సుండుపల్లె ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.