News October 7, 2025
కృష్ణా: రైతులకు నష్టం.. దళారులకు లాభం

టమాటాకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చేస్తున్నారు. కర్నూలు మార్కెట్లో అయితే ధర లేక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కేజీ రూ.2కి కూడా రాని పరిస్థితి ఉందని అక్కడ వాపోతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూస్తే స్థానిక మార్కెట్లలో కిలో రూ.40 చొప్పున విక్రయించడంపై వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. రైతుకు ధర రాక, దళారులు పరిస్థితిని సొమ్ము చేసుకుంటూ అధిక ధరలకు అమ్ముతున్నారన్న ఆరోపణలొస్తున్నాయి.
Similar News
News October 7, 2025
BREAKING: నల్గొండలో ఇంటర్ విద్యార్థి దారుణ హత్య

నల్గొండ జిల్లా కేంద్రంలో ఇంటర్ విద్యార్థిని లావణ్య దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. డైట్ కాలేజీ సమీపంలో ఆమె మృతదేహం లభ్యం కావడంతో ఉలికిపాటుకు గురిచేసింది. ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్న పోలీసులు, నిందితుడైన ట్రాక్టర్ డ్రైవర్ కృష్ణ గౌడ్‌ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 7, 2025
మహర్షి వాల్మీకి ఆదర్శంతో జిల్లాను అభివృద్ధి చేయాలి

వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకొని జిల్లా అధికారులు జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. మంగళవారం వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలను కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ నివాళులర్పించారు. యుక్త వయసులో మహర్షి దోపిడీ చేస్తూ దొంగగా జీవించేవారని తన తప్పు తెలుసుకుని మారడంతో వాల్మీకి మహర్షిగా నిలిచాడన్నారు. అధికారులు పాల్గొన్నారు.
News October 7, 2025
కంచం కడిగిన నీటిని ఏ దిక్కున పారబోయాలి?

పళ్లెం కడిగిన నీటిని పారబోసే దిక్కులు మన వృద్ధిని ప్రభావితం చేస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ నీటిని తూర్పు, పశ్చిమం, ఉత్తరం, ఈశాన్యం దిక్కుల వైపు చల్లడం శుభప్రదం అని అంటున్నారు. ఉత్తరం, ఈశాన్యం వైపు చల్లితే లక్ష్మీ కటాక్షం, ధనవృద్ధి, సౌభాగ్యం కలుగుతాయని సూచిస్తున్నారు. ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, వాయవ్యం వంటి దిక్కుల్లో పారబోస్తే ఇంట్లో సంకటాలు, రోగభయాలు, శత్రుత్వం వంటివి కలుగుతాయని అంటున్నారు.