News October 7, 2025
HYD: భద్రతపై యాక్షన్ ప్లాన్ రెడీ: కర్ణన్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ జారీతోనే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. హైదరాబాద్ నగర పోలీసులతో యాక్షన్ ప్లాన్ రెడీ అయిందని, ఎన్‌ఫోర్స్‌మెంట్ కోసం 9 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 9 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, 2 వీడియో సర్వేలెన్స్ టీమ్స్‌తో పాటు ఇతరత్రా టీమ్స్ ఉన్నాయని, అవసరాలకు అనుగుణంగా టీమ్స్ పెంచుతామన్నారు.
Similar News
News October 7, 2025
ధర్మపురి: చికిత్స పొందుతూ మహిళ మృతి

JGTL(D) ధర్మపురి మండలం నక్కలపేట గ్రామానికి చెందిన బగ్గి లక్ష్మి(50)రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈనెల 5న నక్కలపేటలో రోడ్డుపై నడుస్తుండగా బుగ్గారం గ్రామానికి చెందిన రాజశేఖర్ అతివేగంగా కారు నడుపుతూ లక్ష్మిని ఢీ కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను JGTL ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI ఉదయ్‌కుమార్ తెలిపారు.
News October 7, 2025
పోషకాల పశువుల మేత ‘అవిశ’

అవిశ ఆకులు పశువులకు ముఖ్యంగా పాలిచ్చే వాటికి, మేకలకు అద్భుతమైన ఆహారమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అవిశ ఆకుల్లో 25-30 శాతం ప్రొటీన్లు ఉంటాయి. పశువులకు సులభంగా జీర్ణమయ్యే మేత ఇది. పశువులు అవిశ ఆకులను చాలా ఇష్టంగా తిని అధిక పాల దిగుబడినిస్తాయి. అవిశ పిండి(అవిశ గింజల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పదార్థం)ని కూడా పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. దీనిలో ప్రొటీన్లు, పోషకాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.
News October 7, 2025
HYD: హెచ్ఎండీఏకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చిన హైకోర్టు

గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణాలకు అనుమతిస్తూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాము అనే వ్యక్తి దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కౌంటర్ దాఖలుకు హెచ్ఎండీఏ పలు వాయిదాలు తీసుకుంది. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ లాస్ట్ ఛాన్స్‌గా రెండు వారాలు గడువు ఇచ్చింది. ఈలోపు కౌంటర్ దాఖలు చేయకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించింది.