News October 7, 2025
తూర్పుగోదావరి జిల్లాలో జాబ్ మేళా

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని నల్లజర్లలో ఈనెల 8న 1014 పోస్టులకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. 23 కంపెనీలు ఇందులో పాల్గొననున్నాయి. ఆసక్తిగల టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఫార్మసీ, ఎంబీఏ, బీబీఏ, ఎంఎస్సీ అర్హతగల అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 18 నుంచి 35ఏళ్ల లోపు గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
Similar News
News October 7, 2025
పోషకాల పశువుల మేత ‘అవిశ’

అవిశ ఆకులు పశువులకు ముఖ్యంగా పాలిచ్చే వాటికి, మేకలకు అద్భుతమైన ఆహారమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అవిశ ఆకుల్లో 25-30 శాతం ప్రొటీన్లు ఉంటాయి. పశువులకు సులభంగా జీర్ణమయ్యే మేత ఇది. పశువులు అవిశ ఆకులను చాలా ఇష్టంగా తిని అధిక పాల దిగుబడినిస్తాయి. అవిశ పిండి(అవిశ గింజల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పదార్థం)ని కూడా పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. దీనిలో ప్రొటీన్లు, పోషకాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.
News October 7, 2025
కంచం కడిగిన నీటిని ఏ దిక్కున పారబోయాలి?

పళ్లెం కడిగిన నీటిని పారబోసే దిక్కులు మన వృద్ధిని ప్రభావితం చేస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ నీటిని తూర్పు, పశ్చిమం, ఉత్తరం, ఈశాన్యం దిక్కుల వైపు చల్లడం శుభప్రదం అని అంటున్నారు. ఉత్తరం, ఈశాన్యం వైపు చల్లితే లక్ష్మీ కటాక్షం, ధనవృద్ధి, సౌభాగ్యం కలుగుతాయని సూచిస్తున్నారు. ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, వాయవ్యం వంటి దిక్కుల్లో పారబోస్తే ఇంట్లో సంకటాలు, రోగభయాలు, శత్రుత్వం వంటివి కలుగుతాయని అంటున్నారు.
News October 7, 2025
MP సీటుతో కమల్ అమ్ముడుపోయారు: అన్నామలై

కరూర్ తొక్కిసలాటపై TNలో రాజకీయ చిచ్చు రాజుకుంది. ప్రభుత్వాన్ని పొగిడిన కమల్ హాసన్‌పై బీజేపీ నేత అన్నామలై విరుచుకుపడ్డారు. MP సీటుతో DMKకి అమ్ముడుపోయారని విమర్శించారు. ఆయన్ను తమిళ ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదని అన్నారు. కాగా ఇటీవల బాధితుల్ని పరామర్శించిన NDA ఎంపీలు ప్రభుత్వ వైఫల్యమే కారణమని తప్పుబట్టారు. కరూర్ ఘటనను BJP రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని CM స్టాలిన్ దానికి కౌంటరిచ్చారు.