News October 7, 2025

ఆసిఫాబాద్: నేడు జిల్లాకు రానున్న రాష్ట్ర మంత్రులు

image

కెరమెరి మండలం జోడేఘాట్‌లో కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, గిరిజన శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ రానున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కెరమిరి మండలానికి చేరుకుంటారన్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు జోడేఘాట్‌లో కొమురం భీంకు నివాళి అర్పిస్తారన్నారు.

Similar News

News March 10, 2026

‘కదిరి’ పేరు ఎలా వచ్చిందంటే?

image

​శ్రీ సత్యసాయి జిల్లాలోని లక్ష్మీనరసింహ స్వామి వెలసిన కదిరికి ఆ పేరు రావడం వెనుక ఆసక్తికరమైన పురాణగాథ ఉంది. సంస్కృతంలో ‘ఖాదర’ అంటే చండ్ర చెట్టు అని అర్థం. ఇక్కడ నరసింహస్వామి వారు చండ్ర చెట్టు తొర్ర నుంచి స్వయంభూగా వెలిసినందున ఈ ప్రాంతానికి ‘ఖాద్రీ’ అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అది ‘కదిరి’గా రూపాంతరం చెందింది. భక్త ప్రహ్లాదుని కోరిక మేరకు స్వామి వారు ఇక్కడ వెలిశారని ప్రతీతి.

News March 10, 2026

ఉండవల్లి: ప్రమాదంలో వృద్ధురాలు స్పాట్‌డెడ్

image

తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి సాయిబాబా గుడి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన నల్లమట్టి టిప్పర్ ఢీకొనడంతో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. అనుమతులు లేకుండా, అతివేగంతో మట్టి లారీలు తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News March 10, 2026

విశాఖ, ఉప్పాడలో కోత నివారణ పనులు

image

విశాఖ, ఉప్పాడ తీర ప్రాంతాల్లో సముద్ర కోత నివారణకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. విశాఖ తీర రక్షణ కోసం రూ.203 కోట్ల ప్రాజెక్టుకు తుది అనుమతులు లభించాయి. అలాగే ఉప్పాడ తీరంలో రక్షణ గోడ నిర్మాణానికి కేంద్రం రూ.323 కోట్లు మంజూరు చేసింది. డిప్యూటీ సీఎం పవన్ ప్రతిపాదించిన ‘గ్రేట్ గ్రీన్ వాల్’ ద్వారా తీరం వెంబడి 5 కి.మీ.ల మేర మొక్కలు నాటి ప్రకృతి సిద్ధమైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయనున్నారు.