News October 7, 2025
జడ్చర్ల: కోనేరులో పడ్డ యువకుడి మృతదేహం లభ్యం

జడ్చర్లలో సోమవారం <<17930890>>కోనేరులో పడ్డ యువకుడి<<>> మృతదేహం బుధవారం ఉదయం లభ్యమైంది. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం కోనేరులో ప్రమాదవశాత్తు పడ్డ వెంకటేశ్వర కాలనీకి చెందిన తప్పేట ప్రవీణ్ (28) మృతదేహం ఈరోజు ఉదయం తేలింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Similar News
News October 8, 2025
MBNR: ఎన్నికల నిబంధనలపై అవగాహన ఉండాలి: కలెక్టర్

మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మంగళవారం ఎన్నికల ప్రొసీడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేందుకు కృషి చేయాలని కోరారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనలపై అధికారులకు పూర్తి అవగాహన తప్పనిసరి అని ఆమె పేర్కొన్నారు.
News October 8, 2025
MBNR: నవంబర్ చివరి నాటికి నిర్వాసితులకు ప్లాట్లు: కలెక్టర్

ఉదండాపూర్ భూ నిర్వాసితులకు నవంబర్ చివరి నాటికి ప్లాట్లను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పునరావాస ప్రాంతంలో 300 గజాల ప్లాటుతో పాటు ఆసుపత్రి, పాఠశాల, సీసీ రోడ్లు వంటి మౌలిక వసతులు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
News October 7, 2025
MBNR: ‘వాల్మీకిని ఆదర్శంగా తీసుకుని జీవించాలి’

వాల్మీకి మహర్షిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని నీతి, నిజాయతీతో జీవించాలని ఎస్పీ జానకి అన్నారు. వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. రామాయణాన్ని రచించడం ద్వారా ప్రజలకు ఎంతో నీతిని చాటి చెప్పారని, నిబద్ధతతో ఉండి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఎలా జీవించాలో మహర్షి చూపించారని ఎస్పీ పేర్కొన్నారు.