News October 7, 2025
రాష్ట్రంలోనే మొదటి స్థానంలో దేవరకొండ ఆర్టీసీ డిపో

దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ఆక్యుఫెన్సీ రేషియోలో రాష్ట్రంలో మొదటి స్థానంలో దేవరకొండ ఆర్టీసీ డిపో నిలిచిందని మేనేజర్ రమేశ్ బాబు తెలిపారు. డిపోలో సోమవారం రాత్రి నిర్వహించిన సంబరాలల్లో ఆయన పేర్కొన్నారు. అనంతరం సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పడాల సైదులు, కృష్ణయ్య,దీప్లాల్, పాపరాజు, సమాద్ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News October 7, 2025
NLG: మార్క్ చూపించేలా.. అభ్యర్థుల ఎంపిక!

స్థానిక ఎన్నికలపై జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నది. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో తమ మార్క్ చూపించేలా ఆ పార్టీ అభ్యర్థుల ఎంపిక మొదలుపెట్టింది. ZPTC అభ్యర్థులను PCC ఖరారు చేయనున్న నేపథ్యంలో ఒక్కోస్థానానికి ముగ్గురేసి బలమైన అభ్యర్థులతో జాబితా సిద్ధం చేస్తున్నారు. ఈ జాబితా పరిశీలించాక PCC అభ్యర్థులను ఖరారు చేయనున్నది. సర్పంచి, MPTC స్థానాలకు అభ్యర్థుల ఎంపిక జిల్లా స్థాయిలోనే జరగనుంది.
News October 6, 2025
దేవరకొండ ప్రమాదంలో మృతుడు చారగొండ వాసి

దేవరకొండ మండలం కొండభీమనపల్లి వద్ద బైక్, లారీ ఢీకొని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మృతుడు నాగర్ కర్నూల్ జిల్లా చారగొండకు చెందిన కొట్ర శివగా గుర్తించినట్లు సీఐ వెంకటరెడ్డి తెలిపారు. మహిళ వివరాలు తెలియలేదని చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ చారకొండ వైపు వెళుతుండగా, శివ దేవరకొండ వెళుతున్నాడని స్థానికులు తెలిపారు.
News October 6, 2025
NLG: బాగా చదువుకోవాలి: కలెక్టర్

త్రిపురారంలో ఉన్న తెలంగాణ గిరిజన బాలికల సంక్షేమ మినీ గురుకులాన్ని, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా గిరిజన బాలికల సంక్షేమ మినీ గురుకులాన్ని తనిఖీ చేసి సెలవుల తర్వాత పాఠశాలకు వచ్చిన విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. వారి పేర్లు, వివరాలు, ఇష్టం ఉన్న సబ్జెక్టులు తదితర అంశాలను ముచ్చటించారు. బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు.