News October 7, 2025
మంగపేటకు బస్సు ఎప్పుడు వచ్చిందో తెలుసా?

ములుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమైన మంగపేట గ్రామానికి 1977లో బస్సు సౌకర్యం ఏర్పాటయింది. అప్పటి MLA సంతోశ్ చక్రవర్తి ఏజెన్సీ ప్రజల రవాణా ఇబ్బందులను గుర్తించి బస్సును ఏర్పాటు చేయించారు. వరంగల్ డిపోకు చెందిన బస్సును RTC అధికారులు మంగపేటకు కేటాయించారు. ఏజెన్సీ ఏరియాకు మొదటిసారిగా బస్సు రావడంతో నాటి ప్రజలకు ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.
Similar News
News October 7, 2025
నిర్మల్: చెరువులో దూకి ఇద్దరు అన్నదమ్ముల మృతి

ఇద్దరు అన్నదమ్ములు చెరువులో పడి మృతి చెందిన ఘటన నిర్మల్ బంగల్పేట్ చెరువులో మంగళవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన నరేష్ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తమ్ముడు నవీన్ కాపాడడానికి వెళ్లాడు. దీంతో ఇద్దరు చెరువులో మునిగిపోయి చనిపోయారు. జాలర్లు మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల వివరాలు తెలియాల్సి ఉంది.
News October 7, 2025
జంగారెడ్డిగూడెం: పోలీస్ జాగిలంతో తనిఖీలు

జంగారెడ్డిగూడెంలో పోలీసులు మంగళవారం జాగిలంతో తనిఖీలు నిర్వహించారు. సీఐ సుభాశ్, ఎస్ఐ జబీర్‌లు బస్టాండ్, జనాలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేశారు. జాగిలాలతో బస్ స్టాండ్‌లోని ప్రయాణికుల లగేజీలు, పార్శిల్ ప్రాంతాలు, అనుమానాస్పద వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించారు. రవాణా కేంద్రాల్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దొంగతనాలు నివారించడమే లక్ష్యంతో ఈ తనిఖీలు చేశామని సీఐ తెలిపారు. –
News October 7, 2025
MBNR: వరల్డ్ స్కిల్ కాంపిటీషన్‌కు దరఖాస్తు చేసుకోండి

వరల్డ్ స్కిల్ కాంపిటీషన్-2025లో పాల్గొనేందుకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 15లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రి ప్రియ తెలిపారు. ఈ పోటీల్లో 63 కేటగిరీలలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించవచ్చని, ఇవి జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఉంటాయని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. https://www.skillindiadigital.gov.in