News April 7, 2024
సత్యవేడు: మద్యం మత్తులో బావిలో పడి మృతి
మద్యం మత్తులో బావిలో స్నానం చేయడానికి వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సత్యవేడు మండలంలో చోటుచేసుకుంది. ఎలుమలై (44) అనే వ్యక్తి మద్యం మత్తులో మండలంలోని నాగాలమ్మ దేవాలయం వద్ద బావిలో స్నానం చేయడానికి వెళ్లి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరాంజనేయులు తెలిపారు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 23, 2024
చంద్రగిరి: హైవేపై ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్
చంద్రగిరి మండలం, కోదండరామాపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళుతున్న బైక్ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై తిరుపతికి వస్తున్న దంపతుల్లో భర్త అక్కడిక్కడే మృతి చెందగా, భార్య తీవ్రంగా గాయపడింది. కొంత దూరం వెళ్లి కారు వదిలి డ్రైవర్ పరారయ్యాడు. మృతుడు తిరుచానూరుకు చెందిన బాలాజీగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 23, 2024
CTR: ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
చిత్తూరు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని హాస్పిటల్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ పద్ధతిలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DMHO కార్యాలయం తెలిపింది. ల్యాబ్ టెక్నీషియన్-03, ఫిమేల్ నర్సింగ్-07, సానిటరీ అటెండర్ కం వాచ్మెన్-06 మొత్తం 16 ఖాళీలు ఉన్నట్లు వివరించారు. అర్హత, ఇతర వివరాలకు https://chittoor.ap.gov.in/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 27 అని పేర్కొన్నారు.
News December 22, 2024
చిత్తూరు: ఈ లెటర్ మీ ఇంటికి వచ్చిందా.. జాగ్రత్త
చిత్తూరు జిల్లాలో సైబర్ మోసాలు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటి వరకు సోషల్ మీడియా అకౌంట్లు, బ్యాంక్ ఖాతా, ఏటీఎం మోసాలనే చూశాం. ఇది వాటికి మించినది. సైబర్ నేరగాళ్లు మీ ఇంటి ముందు ఓ ప్రముఖ కొరియర్ ఫాం పడేసి డెలివరి డేట్ మార్చాలనో లేదా అడ్రస్ మార్చాలనో అడుగుతారు. పొరపాటున మీరు ఫాంపై ఉన్న క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేశారో అంతే సంగతులు. ఖాతాలో ఉన్న నగదు మొత్తం మాయం. ఇలాంటి వాటిపై తస్మాస్ జాగ్రత్త.