News October 7, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. BJP లిస్ట్‌లో నందమూరి సుహాసిని పేరు..?

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంపై బీజేపీ దృష్టి సారించింది. పోటీ అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురు సభ్యుల కమిటీని పార్టీ నియమించింది. లంకాల దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, నందమూరి సుహాసిని సహా ఏడుగురి పేర్లు షార్ట్‌లిస్ట్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ సాయంత్రం అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండగా రాబోయే రోజుల్లో జూబ్లీహిల్స్‌లో ఎన్నికల రణరంగం మరింత వేడెక్కనుంది.
Similar News
News April 6, 2026
SRPT: నీటి ఎద్దడి లేకుండా చూడాలి – మంత్రి ఉత్తమ్

రాష్ట్రంలో తాగునీరు, యాసంగి పంటలకు సాగునీటి సరఫరాపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. చివరి తడి వరకు రైతులకు నీరందించాలని, ఎండల దృష్ట్యా తాగునీటి కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై CWPRS అధ్యయన పురోగతిని చర్చించిన మంత్రి, పనుల్లో వేగం పెంచాలని సూచించారు.
News April 6, 2026
నీటి భద్రతే లక్ష్యం: సీఎం చంద్రబాబు

100 రోజుల యాక్షన్ ప్లాన్‌తో నీటిని సంరక్షిస్తామని యాడికిలో జరిగిన ‘జలధార’ కార్యక్రమంలో CM చంద్రబాబు ప్రకటించారు. అనంతపురం జిల్లాలో గతంలో 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ అందించి హార్టికల్చర్ హబ్‍గా మార్చామని గుర్తుచేశారు. భూగర్భజలాలు 1.92 మీటర్లు పెరిగాయని, మైక్రో ఇరిగేషన్ అమలులో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. జిల్లా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
News April 6, 2026
మండపేట: కాలువలో పడ్డ కారు.. దంపతులు మృతి

మండపేట మండలం తాపేశ్వరం శివారు పేకేటిపాకలు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. రూరల్ CI దొరరాజు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ నుంచి వెలగతోడు వెళ్తుండగా కారు అదుపుతప్పి కాలువలో పడింది. ఈ ప్రమాదంలో బోగిల్లి వీర వెంకట సతీశ్ (40), ఆయన భార్య బోగిల్లి కిరణ్మయి (36) నీటిలో మునిగి మరణించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


