News October 7, 2025
గూగుల్ మ్యాప్స్‌లో ఆర్టీసీ బస్సుల సమాచారం!

TG: బస్సుల సమాచారాన్ని ప్రయాణికులకు RTC మరింత చేరువ చేయనుంది. దీపావళి నుంచి బస్సుల వివరాలను గూగుల్ మ్యాప్స్ ద్వారా విడతలవారీగా ప్రయాణికులకు అందించాలని చూస్తోంది. దీంతో పాటు ‘మీ టికెట్’ యాప్ ద్వారా QR కోడ్ టికెట్లు, QR ఆధారిత డిజిటల్ పాస్‌లు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ప్రారంభ తేదీని ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అటు మరో 3 నెలల్లో HYD పరిధిలో 275 EV బస్సులు అందుబాటులోకి రానున్నాయి.
Similar News
News February 18, 2026
బొప్పాయి రోజూ తింటే..

బొప్పాయి అన్ని సీజన్లలో లభించే పండ్లలో ఒకటి. దీన్ని రోజూ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. ఇందులో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. జీర్ణ సమస్యలు, దృష్టిలోపాలతో పాటు క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. వీటితో పాటు అల్జీమర్స్, ఆర్థరైటిస్, డయాబెటిస్, గుండెజబ్బులను దూరం చేయడంలోనూ కీలకంగా పనిచేస్తుంది.
News February 18, 2026
టాప్ 10 ధనిక రాష్ట్రాల్లో AP, TG

FY25లో టాప్ 10 రిచెస్ట్ స్టేట్స్‌లో తెలుగు రాష్ట్రాలు నిలిచాయి. ₹16.41లక్షల కోట్లతో తెలంగాణ ఏడో స్థానంలో, ₹15.93లక్షల కోట్లతో ఏపీ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. ఇక ₹45.32లక్షల కోట్లతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచినట్లు RBI డేటా వెల్లడించింది. తమిళనాడు (₹31.19L Cr) రెండోస్థానం, యూపీ (₹29.78L Cr) మూడోస్థానంలో నిలిచాయి. ఇక అత్యల్ప GSDP ఉన్న రాష్ట్రంగా ₹4423 కోట్లతో అరుణాచల్ ప్రదేశ్ నిలిచింది.
News February 18, 2026
ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికెట్ అప్లై చేసుకోండి

పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడం అతిపెద్ద టాస్క్. దీనికి బ్యాంకులు/ పోస్టాఫీసుల్లో క్యూలో నిలబడాల్సిన పనిలేకుండా ఆన్‌లైన్‌లోనూ చేసుకోవచ్చు. జీవన్ ప్రమాణ్ యాప్‌తో పాటు ఫేస్ అథెంటికేషన్ కోసం AadhaarFaceRD యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీ ఆధార్ నంబర్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నంబర్, బ్యాంక్ వివరాలు ఇవ్వాలి. బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తయ్యాక సర్టిఫికెట్ ఆటోమెటిక్‌గా సంబంధిత బ్యాంక్‌కు వెళ్తుంది.


