News October 7, 2025

కుబీర్: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య

image

పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుబీర్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుబీర్‌కు చెందిన ముచ్చిండ్ల గణేష్ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు హుటాహుటీన భైంసా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ తరలించగా చికిత్స పొందుతూ గణేష్ మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 11, 2026

KMR: రేపు జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీలు

image

కామారెడ్డి జిల్లాలో ఆదివారం ఉదయం 10 గంటలకు డీఎస్ఏ రెజ్లింగ్ హాల్‌లోని స్విమ్మింగ్ పూల్ వద్ద జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా రెజ్లింగ్ ఛైర్మన్ వినోద్ తెలిపారు. ఈ పోటీలకు 2009–2011 మధ్య జన్మించిన క్రీడాకారులు అర్హులని, పాల్గొనేవారు తమ ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు. పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.

News April 11, 2026

వనపర్తి జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

image

వనపర్తి జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. 21 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాలలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా రేవల్లిలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దగడ 41.0, వీపనగండ్ల 40.7, పెద్దమందడి 40.6, వెలుగొండ 40.3, పానగల్, రేమద్దుల, ఘనపూర్ 40.0, అమరచింత, కేతేపల్లి 39.9, మదనాపురం 39.8, కానాయిపల్లి 39.4, విలియంకొండ 39.3, డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News April 11, 2026

IRCTC చెన్నైలో 84 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు

image

కాంట్రాక్ట్ పద్ధతిలో 84 హాస్పిటాలిటీ మానిటర్స్ పోస్టుల భర్తీకి IRCTC చెన్నైజోనల్ ఆఫీస్ నోటిఫికేషన్ ఇచ్చింది. BSc హాస్పిటాలిటీ&హోటల్‌ అడ్మినిస్ట్రేషన్, హోటల్‌ మేనేజ్‌మెంట్‌&క్యాటరింగ్‌ సైన్స్, సంబంధిత విభాగాల్లో BSc/BBA/MBA చేసినవారు అర్హులు. నెలకు రూ.30,000 స్టైఫండ్‌గా ఇస్తారు. వయసు 27 ఏళ్లు ఉండాలి. APR- 25, 27, 28న ఇంటర్వ్యూలు ఉంటాయి. మరిన్ని వివరాలకు https://irctc.com/new-openings.php చూడండి.