News October 7, 2025

ఎనుమాముల మార్కెట్లో పెరిగిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారంతో పోలిస్తే నేడు మిర్చి ధరలు పెరిగాయి. సోమవారం తేజా మిర్చి(ఏసీ) క్వింటాకు రూ.14,350 ధర పలకగా.. ఈరోజు రూ.14,550కి చేరింది. 341 రకం మిర్చి(ఏసీ)కి నిన్న రూ.14,500 ధర వస్తే.. నేడు రూ.15,300 అయింది. మరోవైపు, వండర్ హాట్(WH) ఏసీ మిర్చికి నిన్న రూ.15,500 ధర రాగా.. నేడు రూ.16వేలు అయినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.

Similar News

News March 16, 2026

కలెక్టర్‌ను కలిసిన జిల్లా గ్రంథాలయం ఛైర్మన్

image

జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా మేకపాటి శాంతి కుమారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా సోమవారం కలెక్టర్ హిమాన్షు శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌కు ఆమె పూల బొకే అందజేశారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి సహకారం అందించాలని ఆమె కలెక్టర్‌ను కోరారు.

News March 16, 2026

ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్.. విద్యార్థులకు పాఠాలు

image

కొణిజర్ల మండల పర్యటనలో భాగంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చిన్నమునగాల పాఠశాలలో సందడి చేశారు. తరగతి గదిలోకి వెళ్లిన ఆయన స్వయంగా ఉపాధ్యాయునిలా మారి విద్యార్థులకు ఆంగ్ల అక్షరాలు, పదాల ఉచ్చారణను నేర్పించారు. వారితో ముచ్చటించి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్.. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.

News March 16, 2026

200 మందికి పైగా పిల్లలు మృతి: ఇరాన్

image

US, ఇజ్రాయెల్ దాడుల్లో వందలాది ఇరానియన్లు చనిపోయారని ఆ దేశ ఫారిన్ మినిస్టర్ అరాఘ్చీ తెలిపారు. ఇందులో 200 మందికి పైగా పిల్లలున్నారని వెల్లడించారు. ఇరానియన్లను చంపడాన్ని పొరుగు దేశాలు ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. ‘మేం సీజ్‌ఫైర్ వద్దనేది యుద్ధం కోసం కాదు. శత్రువులు మాపై మరోసారి దాడులు చేయకుండా ఉండేలా ఈ యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నాం. ఇప్పటికే వారికి గుణపాఠం చెప్పాం’ అని పేర్కొన్నారు.