News October 7, 2025
కనకాంబరంలో పిండి నల్లి నివారణకు సూచనలు

పండ్లు, కూరగాయల పంటలను నష్టపరిచే పిండి నల్లి కనకాంబరం పంటను కూడా ఆశిస్తుంది. మొక్కల లేత కొమ్మలు, ఆకుల పూమొగ్గలు తెల్లటి పిండిలాంటి పదార్థంతో కప్పబడి ఉంటే పిండినల్లి ఆశించిందని గుర్తించాలి. ఈ పురుగులు రసం పీల్చి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు లీటర్ నీటికి 2ml డైమిథోయేట్ లేదా 2.5ml క్లోరిపైరిఫాస్ లేదా 0.3ml ఇమిడాక్లోఫ్రిడ్ కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
Similar News
News October 7, 2025
తెలిసినవారే.. తెగిస్తున్నారు..

అత్యాచార ఘటనల్లో 98 శాతానికి పైగా నిందితులు బాధితురాళ్లకు పరిచయస్థులేనని జాతీయ నేర గణాంక సంస్థ తాజా నివేదిక వెల్లడిస్తోంది. వీరిలో ఆన్‌లైన్ వేదికల ద్వారా పరిచయమైనవారే ఎక్కువ మంది. చాలా ఘటనల్లో ఇరుగుపొరుగు వారు, సహోద్యోగులు, యజమానులు నిందితులు కాగా, కొన్ని కేసుల్లో మాత్రం కుటుంబసభ్యులే అకృత్యాలకు పాల్పడ్డట్లు రికార్డులు సూచిస్తున్నాయి. కాబట్టి అమ్మాయిలు తెలిసినవారైనాసరే అప్రమత్తంగా ఉండటం మంచిది.
News October 7, 2025
BSNLతో నెట్‌వర్క్ లేకపోయినా ఫోన్ మాట్లాడొచ్చు!

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNLలో తీసుకొస్తున్న మార్పులు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా మొబైల్ నెట్‌వర్క్ లేకపోయినా WiFi ద్వారా వాయిస్ కాల్స్ చేసుకునేందుకు వీలు కల్పించే కొత్త ఫీచర్ VoWiFiను సంస్థ తీసుకొచ్చింది. అలాగే సరసమైన ధరకే రీఛార్జ్ ప్యాక్స్ లభిస్తుండటంతో ఆగస్టులో ఏకంగా 1.38 మిలియన్ల మంది BSNLకు మారినట్లు TRAI తెలిపింది. దీంతో యూజర్లు 91.7 మిలియన్లకు చేరారు. BSNLకి మారుతున్నారా?
News October 7, 2025
సీఐటీడీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

HYDలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్(CITD) 6 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో అభ్యర్థులను రిక్రూట్ చేస్తోంది. పోస్టును బట్టి ఐటీఐ, డిప్లొమా/DTDM/DPE/DAE, BE/ME ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 10, 13, 14 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. రిజిస్ట్రేషన్లు ఉ.9.30 నుంచి మ.12.30గంటల వరకు చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. వెబ్‌సైట్: https://citd.in/