News October 7, 2025
అనకాపల్లి: ఈనెల 9న జగన్ పర్యటన వివరాలు

వైసీపీ అధినేత జగన్ ఈనెల 9వ తేదీ ఉదయం 11 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో హైవే మీదుగా అనకాపల్లి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు అనకాపల్లి మండలం కొత్తూరు చేరుకుని ప్రజలకు అభివాదం చేస్తారు. ఒంటిగంటకు కశింకోట మండలం తాళ్లపాలెం చేరుకుని ప్రజలకు అభివాదం చేసిన అనంతరం మాకవరపాలెం మెడికల్ కళాశాలను సందర్శిస్తారని అనకాపల్లి పార్టీ ఇన్‌చార్జ్ భరత్ కుమార్ తెలిపారు.
Similar News
News March 20, 2026
GNT: చిన్న శివలింగం వెనుక పెద్ద కథ.. లోకేశ్ వివరణ

పూజ గదిలో ఉన్న బొమ్మలపై వచ్చిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేశ్ Xలో స్పందించారు. నాలుగేళ్ల వయసులో తన కుమారుడు దేవాన్ష్ తయారు చేసిన శివుడి బొమ్మ, చిన్న శివలింగాన్ని జ్ఞాపకంగా పూజా గదిలో ఉంచినట్లు తెలిపారు. చిన్న వయసులోనే శివ భక్తుడిగా ఎదుగుతున్నాడని చెప్పారు. భక్తి అనేది కొందరికి అర్థమవుతుందని, మరికొందరికి కాదని, అలాంటి భక్తికి వివరణ అవసరం లేదని పేర్కొన్నారు.
News March 20, 2026
తెలంగాణ బడ్జెట్.. విద్యార్థులకు గుడ్‌న్యూస్

ఇంటర్ స్టూడెంట్స్‌కు మధ్యాహ్న భోజన పథకాన్ని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్‌ఫాస్ట్ అందిస్తామన్నారు. ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2,000 స్కాలర్‌షిప్ ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే దివ్యాంగ విద్యార్థులకు శారీర వైకల్యం అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో వారికి రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు భట్టి వివరించారు.
News March 20, 2026
రాష్ట్ర బడ్జెట్.. ఏ శాఖకు ఎంతంటే?

TG: రాష్ట్ర <<19431667>>బడ్జెట్<<>>లో వివిధ రంగాలకు కేటాయింపులు..
* వ్యవసాయ శాఖ: రూ.23,179 కోట్లు * పౌర సరఫరాల శాఖ: రూ.7,366 కోట్లు
* పశు సంవర్ధకశాఖ: రూ.1,529 కోట్లు * విద్యుత్ శాఖ: రూ.21,285 కోట్లు
* కార్మిక శాఖ: రూ998 కోట్లు * మాతా, శిశు సంక్షేమ శాఖ: రూ.3,143 కోట్లు
* పర్యాటక రంగం: రూ.1,224 కోట్లు * రైతు భరోసా: రూ.18 వేల కోట్లు
* ఆరోగ్యశాఖ: రూ.13,679 కోట్లు * SC సంక్షేమం: రూ.11,784 కోట్లు


