News October 7, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. కాంగ్రెస్ ఫుల్ ఫోకస్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రకటన వెలువడడంతో రాజకీయాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఫుల్ ఫోకస్ పెట్టింది. రెండు, మూడు రోజుల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ బస్తీబాట నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర నాయకులు సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. కచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 21, 2026
మెదక్: ఈసారీ నిరాశే !

రాష్ట్ర బడ్జెట్ మెదక్ జిల్లా ప్రజలను నిరాశ పరిచింది. మెతుకుసీమలో ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు ఘనపూర్ ఎత్తు పెంపు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న రైతులకు నిరాశే మిగిలింది. నూతనంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో జిల్లాలోని 1.68 లక్షల కుటుంబాలకు బీమా వర్తించనుంది. కాళేశ్వరం కెనాల్స్ పనులకు నిధులు లేవు, మెదక్ బైపాస్ రోడ్డు ప్రస్తావనేలేదు. బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
News March 21, 2026
TDP మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

AP: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం TDP మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి(81) కన్నుమూశారు. అనంతపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈయన ఉమ్మడి అనంతపురం జిల్లా TDP అధ్యక్షుడిగా 10 ఏళ్లు పనిచేశారు. పంచాయతీ వార్డు సభ్యుడి స్థాయి నుంచి 2014లో ఎమ్మెల్యేగా ఎదిగారు. అటు ఉమ్మడి ఏపీ మార్క్‌ఫెడ్ ఛైర్మన్‌గా పని చేశారు. ఈయన మృతిపట్ల ఆ పార్టీ నేతలు సంతాపం తెలిపారు.
News March 21, 2026
HYD: ‘హోమియో’కు పెరుగుతున్న ఆదరణ

తెలంగాణలోనే అతిపెద్ద ప్రభుత్వ అయిన హోమియోపతి రామంతపూర్ ఆస్పత్రికి రోజురోజుకూ ఔట్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 700 మంది వరకు రోగులు చికిత్స కోసం ఆస్పత్రిని సందర్శిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రజల్లో హోమియో వైద్యం పట్ల విశ్వాసం పెరుగుతుండటంతో ఈ సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు. ఉ.10:30 గం. నుంచి సా.5:30 వరకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి.


