News October 7, 2025

బ్లాక్ సర్కిల్స్ ఇలా తగ్గిద్దాం..

image

కంప్యూటర్లు, ఫోన్ ఎక్కువగా చూడటం, వేళకు నిద్రపోకపోవడం వల్ల కొందరికి కళ్ల కింద నల్లటిచారలు వస్తాయి. వీటిని కొన్ని ఇంటిచిట్కాలతో తగ్గించుకోవచ్చు. * బంగాళదుంప రసం తీసుకుని కళ్ల అడుగున రాసి 15 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే ఫలితం ఉంటుంది. * బాదంనూనెలో ఉండే విటమిన్ K బ్లాక్‌సర్కిల్స్‌ను తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది. నిద్రపోయే ముందు ఈ నూనెను కళ్లచుట్టూ రాసి మర్దన చేయాలి. <<-se>>#BeautyTips<<>>

Similar News

News October 7, 2025

‘కాళేశ్వరం’ రిపోర్టు.. హైకోర్టులో విచారణ వాయిదా

image

TG: కాళేశ్వరం కమిషన్ నివేదికపై దాఖలైన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దంటూ మాజీ సీఎం KCR, హరీశ్ రావు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఇటీవల ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం ఇవాళ 2 వారాల గడువు కోరింది. దీంతో తదుపరి విచారణను వచ్చే నెల 12కి కోర్టు వాయిదా వేసింది.

News October 7, 2025

తెలిసినవారే.. తెగిస్తున్నారు..

image

అత్యాచార ఘటనల్లో 98 శాతానికి పైగా నిందితులు బాధితురాళ్లకు పరిచయస్థులేనని జాతీయ నేర గణాంక సంస్థ తాజా నివేదిక వెల్లడిస్తోంది. వీరిలో ఆన్‌లైన్‌ వేదికల ద్వారా పరిచయమైనవారే ఎక్కువ మంది. చాలా ఘటనల్లో ఇరుగుపొరుగు వారు, సహోద్యోగులు, యజమానులు నిందితులు కాగా, కొన్ని కేసుల్లో మాత్రం కుటుంబసభ్యులే అకృత్యాలకు పాల్పడ్డట్లు రికార్డులు సూచిస్తున్నాయి. కాబట్టి అమ్మాయిలు తెలిసినవారైనాసరే అప్రమత్తంగా ఉండటం మంచిది.

News October 7, 2025

BSNLతో నెట్‌వర్క్ లేకపోయినా ఫోన్ మాట్లాడొచ్చు!

image

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNLలో తీసుకొస్తున్న మార్పులు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా మొబైల్ నెట్‌వర్క్ లేకపోయినా WiFi ద్వారా వాయిస్ కాల్స్ చేసుకునేందుకు వీలు కల్పించే కొత్త ఫీచర్‌ VoWiFiను సంస్థ తీసుకొచ్చింది. అలాగే సరసమైన ధరకే రీఛార్జ్ ప్యాక్స్ లభిస్తుండటంతో ఆగస్టులో ఏకంగా 1.38 మిలియన్ల మంది BSNLకు మారినట్లు TRAI తెలిపింది. దీంతో యూజర్లు 91.7 మిలియన్లకు చేరారు. BSNLకి మారుతున్నారా?