News October 7, 2025

నార్త్ వెస్టర్న్ రైల్వేలో 2,094 పోస్టులు

image

నార్త్ వెస్టర్న్ రైల్వే 2,094 అప్రెంటిస్ పోస్టుల ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు నవంబర్ 2వరకు అప్లై చేసుకోవచ్చు. జైపుర్‌లోని RRC ఈ నియామకాలు చేపట్టనుంది. అభ్యర్థుల వయసు 15నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ఫీజు రూ.100, SC, ST, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు.

Similar News

News October 7, 2025

BSNLతో నెట్‌వర్క్ లేకపోయినా ఫోన్ మాట్లాడొచ్చు!

image

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNLలో తీసుకొస్తున్న మార్పులు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా మొబైల్ నెట్‌వర్క్ లేకపోయినా WiFi ద్వారా వాయిస్ కాల్స్ చేసుకునేందుకు వీలు కల్పించే కొత్త ఫీచర్‌ VoWiFiను సంస్థ తీసుకొచ్చింది. అలాగే సరసమైన ధరకే రీఛార్జ్ ప్యాక్స్ లభిస్తుండటంతో ఆగస్టులో ఏకంగా 1.38 మిలియన్ల మంది BSNLకు మారినట్లు TRAI తెలిపింది. దీంతో యూజర్లు 91.7 మిలియన్లకు చేరారు. BSNLకి మారుతున్నారా?

News October 7, 2025

సీఐటీడీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

image

HYDలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్(CITD) 6 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో అభ్యర్థులను రిక్రూట్ చేస్తోంది. పోస్టును బట్టి ఐటీఐ, డిప్లొమా/DTDM/DPE/DAE, BE/ME ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 10, 13, 14 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. రిజిస్ట్రేషన్లు ఉ.9.30 నుంచి మ.12.30గంటల వరకు చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. వెబ్‌సైట్: https://citd.in/

News October 7, 2025

విష్ణువు అష్టాక్షరీ మంత్రాన్ని ఎలా పఠించాలంటే?

image

‘ఓం నమో నారాయణాయ’ అనే ఈ అష్టాక్షరీ మంత్రం అతి శక్తిమంతమైనది. దీన్ని జపించేటప్పుడు ఉచ్చారణే కాకుండా.. భక్తి, ఏకాగ్రత, తన్మయత్వం జోడించినప్పుడే పరిపూర్ణ ఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. మంత్రంలోని ప్రతి అక్షరాన్ని విష్ణువు శరీరంలోని ఒక్కో అంగంలో లీనం చేసి ధ్యానం చేయాలని అంటున్నారు.
ఓం – భగవంతుని పాదాలు, న – మోకాళ్లు, మో – తొడలు, నా – ఉదరం, రా – హృదయం, య – వక్షస్థలం, ణా – ముఖం, య – శిరస్సు.