News October 7, 2025
KNR: పొన్నం వ్యాఖ్యలపై రాజుకుంటున్న రగడ

మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేకపై మరోమంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహంగా ఉన్నారట. జూబ్లీహిల్స్‌లో ఓ కార్యక్రమంలో తనను <<17935655>>బాడి షేమింగ్<<>> చేస్తూ చేసిన వ్యాఖ్యలపై సీఎంకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారట. వివేక్ ఓ అహంకారి అని తనకు మంత్రిపదవి రావడం ఆయనకు ఇష్టంలేదని, అలాగే పొన్నంకు శ్రీధర్ బాబు అంటే గిట్టదని, ఇలాంటి పరిస్థితులతోనే ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని సన్నిహితుల వద్ద లక్ష్మణ్ వాపోయారట.
Similar News
News October 7, 2025
NRPT: భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య

భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నారాయణపేట జిల్లా నర్వ మండలంలో చోటు చేసుకుంది. నర్వ గ్రామానికి చెందిన కట్ట రాము ఇటీవల తన భార్య ఆత్మహత్య చేసుకుంది. మనస్థాపానికి గురైన రాము రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతునికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News October 7, 2025
లైసెన్స్ ఆయుధాలు కలిగినవారు అప్పగించాలి: NZB సీపీ

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా లైసెన్స్ పొందిన ఆయుధాలను వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లలో అప్పగించాలని సీపీ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. సెక్షన్ 21 ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్, 1959 ప్రకారం, జిల్లా వ్యాప్తంగా ఈ నెల 9వ తేదీలోపు ఆయుధాలను జమ చేయాలని ఆయన నోటిఫికేషన్ జారీచేశారు. ఆయుధాలు జమ చేయనివారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
News October 7, 2025
BSNLతో నెట్‌వర్క్ లేకపోయినా ఫోన్ మాట్లాడొచ్చు!

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNLలో తీసుకొస్తున్న మార్పులు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా మొబైల్ నెట్‌వర్క్ లేకపోయినా WiFi ద్వారా వాయిస్ కాల్స్ చేసుకునేందుకు వీలు కల్పించే కొత్త ఫీచర్ VoWiFiను సంస్థ తీసుకొచ్చింది. అలాగే సరసమైన ధరకే రీఛార్జ్ ప్యాక్స్ లభిస్తుండటంతో ఆగస్టులో ఏకంగా 1.38 మిలియన్ల మంది BSNLకు మారినట్లు TRAI తెలిపింది. దీంతో యూజర్లు 91.7 మిలియన్లకు చేరారు. BSNLకి మారుతున్నారా?