News October 7, 2025
పైడితల్లమ్మ కరుణతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి: లోకేశ్

విజయనగరం శ్రీపైడితల్లమ్మ సిరిమానోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి.. విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. అమ్మవారి కరుణతో రాష్ట్రం, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అని ‘X’వేదికగా పైడితల్లి అమ్మవారి ఫోటో పెట్టారు.
Similar News
News October 7, 2025
పెద్దపల్లి ఎమ్మెల్యే నివాసానికి మంత్రులు

ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా MLA వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి, స్థానిక సంస్థల ఎన్నికలపై వారంతా చర్చించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News October 7, 2025
అన్నమయ్య: అనాథలైన చిన్నారులు

కర్ణాటక సరిహద్దులోని రాయల్పాడు వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా రామసముద్రం(M) ఎర్రబోయినపల్లికి చెందిన రామంజులు, అతని భార్య కళావతి మృతిచెందిన విషయం తెలిసిందే. దసరా సెలవులు ముగించుకుని పని నిమిత్తం తిరిగి బెంగళూరుకు బైకుపై బయల్దేరిన దంపతులను టెంపో ఢీకొట్టడంతో ఇద్దరూ చనిపోయారు. వాళ్ల ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
News October 7, 2025
GDK: కష్టపడి చదివితే విజయం వరిస్తుంది: గ్రూప్- 1 విజేత

కష్టపడి చదివితే విజయం వరిస్తుందని గ్రూప్ 1లో DSP ఉద్యోగం సాధించిన లతీఫా ఆశా అన్నారు. GDK మార్కండేయ కాలనీకి చెందిన ఆమెను, తండ్రి దాదా సలాంను ఆత్మీయంగా సన్మానించారు. ఈ సందర్భంగా లతీఫా మాట్లాడుతూ.. నేటి యువత సామాజిక మాధ్యమాలపై దృష్టి సారించకుండా దీక్ష, పట్టుదలతో చదువుకోవాలన్నారు. తండ్రి డిగ్రీ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ సలాం మాట్లాడుతూ.. తన కుమార్తె DSPగా ఉద్యోగం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.