News October 7, 2025

కొండాపురంలో అత్యధిక వర్షం

image

కొండాపురం మండలంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో అత్యధికంగా ఇక్కడే 93.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా బ్రహ్మంగారి మఠం, కోడూరులో 4.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇటీవల కురిసిన వర్షాలు కొన్ని పంటలకు మేలు చేకూర్చగా.. మరికొన్ని పంటలకు తీవ్ర నష్టం జరిగింది. మొక్కజొన్న, పత్తి సాగు చేసిన రైతులు నష్టపోయారు.

Similar News

News March 31, 2026

కడప జిల్లాలో రణబాలి షూటింగ్

image

కడప జిల్లా సింహాద్రిపురం మండలం కోవరం గుంటపల్లె గ్రామంలో రణబాలి సినిమా షూటింగ్ జరిగింది. ఈ షూటింగ్‌లో హీరో విజయ్ దేవరకొండ, పలువురు జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నట్లు తెలిసింది. కోవరం గుంటపల్లి గ్రామంలో రణబాలి షూటింగ్ పూర్తిచేసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. హీరో విజయ్ దేవరకొండ తమ గ్రామానికి రావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

News March 31, 2026

రేపు ఒంటిమిట్ట కోదండ రామయ్య కళ్యాణోత్సవం

image

ఒంటిమిట్టలో శ్రీకోదండ రామాలయంలో బుధవారం సీతారాముల కళ్యాణోత్సవం జరగనుంది. ప్రపంచంలో రాత్రివేళ సీతారాముల కళ్యాణం జరిగే ఏకైక క్షేత్రం ఇదే. ఈ కళ్యాణానికి టీడీపీ ఏర్పాట్లు పూర్తి చేసింది. లక్ష మందికిపైగా భక్తులు వస్తారని అంచనా వేస్తోంది. కళ్యాణ వేదిక ప్రాంగణంలో భక్తులు కూర్చునేందుకు 121 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. 2,100 మంది పోలీసులు బందోబస్తుకు రానున్నారు.

News March 31, 2026

కడప జిల్లాలో P4 ఇలా..!

image

కడప కలెక్టరేట్‌లో P4 కార్యక్రమంపై ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. వివరాలు ఇలా
*బంగారు కుటుంబాలు:68,354
*కుటుంబ సభ్యులు:1,94,993
*దత్తత తీసుకున్న కుటుంబాలు:28,539
*దత్తత తీసుకోవాల్సిన కుటుంబాలు:39,815
*ధృవీకరించబడినవి:23,639
*పెండింగ్‌లో ఉన్నవి:44,715
*మొత్తం మార్గదర్శులు:2,982
*సంప్రదించిన వారు:584
*సంప్రదించాల్సిన వారు:2,092
*సమీకరించిన నిధులు: ₹24,58,280లు