News October 7, 2025
BREAKING: హైదరాబాద్‌లో IT అధికారుల సోదాలు

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ అధికారుల సోదాలు చేస్తున్నారు. కొండాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో సోదాలు చేస్తున్న ఐటీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కొండాపూర్ అపర్ణ హోమ్స్‌లో ఉంటున్న వెంకట్ రెడ్డి అనే వ్యక్తి నివాసంలో ఐటీ సోదాలు జరగుతున్నాయి. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఉన్నట్లుగా తెలియడంతో అనధికారిక లావాదేవీల ఆధారంగా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 6, 2026
సికింద్రాబాద్ KVSలో అడ్మిషన్లు ప్రారంభం

సికింద్రాబాద్ పికెట్‌లోని కేంద్రీయ విద్యాలయం(KVS)లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 4వ తరగతికి ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు పాఠశాల అధికారులు తెలిపారు. ఆసక్తి గల తల్లిదండ్రులు నేరుగా పాఠశాలకు వెళ్లి దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం సూచించింది.
News April 6, 2026
హైదరాబాద్‌లో నేడు అక్కడక్కడ చిరు జల్లులు

హైదరాబాద్‌లో ఇవాళ పాక్షిక మేఘావృతమైన వాతావరణం ఉండనుంది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 37℃, కనిష్ఠం 26℃ వరకు నమోదు కానుందని, వాయవ్య దిశ నుంచి గంటకు 4- 6 కి.మీల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
News April 6, 2026
HYD: సర్వ రోగాలకు మందు ఇక్కడే!

ప్రజలకు వ్యాధులు వస్తే అత్యాధునిక ఆస్పత్రుల్లో వైద్యం అందించేకంటే అవి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జిమ్ ఫీజు భరించలేక వీటికి దూరమవుతున్నారు. రోజూ 45 MIN వ్యాయామంతో షుగర్, BP రావని నిపుణల మాట. GHMCలోని వార్డుల్లో, శివారు గ్రామాల్లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి, పాడైనవి రిపేర్ చేయాలి. దీనికోసం కబ్జా అయిన పార్క్ స్థలాలను విడిపించి పార్క్‌గా, ఓపెన్ జిమ్‌గా మార్చితే సరి. మీరేమంటారు?


