News October 7, 2025
మేడారం: నాడు రూ.వేలల్లో.. నేడు రూ.కోట్లల్లో!

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర 1968 నుంచి అధికారికంగా ప్రారంభమైంది. నాడు జాతరకు హుండీల ద్వారా రూ.లక్ష 20 వేల ఆదాయం రాగా.. జాతరకు రూ.60,000 ఖర్చు అయింది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే జాతరకు 2024లో రూ.13.25 కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చింది. జాతర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ రూ.100 కోట్లకు అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తోంది.
Similar News
News March 25, 2026
పొదుపులో మహిళలు మహారాణులే.. కానీ!

డబ్బు దాచడంలో భారత మహిళలు ముందున్నా పెట్టుబడుల విషయంలో మాత్రం వెనకబడే ఉన్నారు. తాజా నివేదిక ప్రకారం 70%మంది మహిళలు పొదుపు చేస్తున్నారు. అయితే ఇందులో 40%మంది మాత్రమే FD, బంగారం వంటి సంప్రదాయ పెట్టుబడులపై కాకుండా షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అవగాహన లేకపోవడం, నష్టభయం వల్ల చాలామంది వీటికే పరిమితమవుతున్నారు. ఎక్కువ మంది తమ ఆదాయంలో 10% కంటే తక్కువ పెట్టుబడి పెడుతున్నారట.
News March 25, 2026
నరసాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీ

నరసాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్ట్రార్ జి.శివయ్య బుధవారం సందర్శించి, రికార్డులను తనిఖీ చేశారు. వార్షిక ఆదాయం, రిజిస్ట్రేషన్ల విధానంపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, భీమవరం పరిధిలోని 15 కార్యాలయాల ద్వారా ఈ నెల 23 నాటికి రూ.425.17 కోట్ల రెవెన్యూ వచ్చినట్లు వెల్లడించారు. అనంతరం విధుల్లో పారదర్శకత పాటించాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు.
News March 25, 2026
GNT: రేపు పోలీస్ కండెమినేషన్ వస్తువుల బహిరంగ వేలం

గుంటూరు (D) పోలీస్ శాఖకు చెందిన పాత వస్తువుల బహిరంగ వేలం మార్చి 26న నిర్వహించనున్నారు. SP వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం 4 గ. RI స్టోర్‌లో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో పాత టెంట్లు, కుర్చీలు, సమియానాలు, ప్లాస్టిక్ డ్రమ్ములు, ఫ్యాన్లు, టార్చ్‌లైట్లు, వివిధ రకాల వస్తువులను వేలం వేయనున్నారు. ఆసక్తి గల వారు ఈ వేలంలో పాల్గొని వస్తువులను కొనుగోలు చేయవచ్చని చెప్పారు.


