News October 7, 2025
పైడిమాంబకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం

పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం సందర్భంగా రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అమ్మవారిని మంగళవారం దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించి ఆశీర్వచనాలు పొందారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. కాగా నిన్న రాత్రి తొలేళ్ల ఉత్సవం జరగ్గా.. ఈరోజు సాయంత్రం సిరిమానోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News October 7, 2025
జిల్లా ప్రజలకు ఎస్పీ సూచనలు..!

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ బీ ఉమామహేశ్వర్ మంగళవారం పలు సూచనలు చేశారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లను నమ్మవద్దన్నారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయొద్దని తెలిపారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని సూచించారు. అధికారిక యాప్‌లను మాత్రమే డౌన్లోడ్ చేసుకుని, వాటికి స్ట్రాంగ్ పాస్‌వర్డ్ ఉపయోగించాలని పేర్కొన్నారు.
News October 7, 2025
రోహిత్, కోహ్లీని ఎందుకు సెలక్ట్ చేశారో: మాజీ కెప్టెన్

వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తొలగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్న వేళ మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘AUS టూర్‌కు రోహిత్, కోహ్లీని ఎందుకు సెలక్ట్ చేశారో? లాంగ్ బ్రేక్ కారణంగా వారి ఫామ్, ఫిట్‌నెస్ అంచనా వేయడం కష్టం. కేవలం రికార్డులు చూసి ఎంపిక చేసినట్లున్నారు. సెలక్టర్లు ఆలోచించాల్సింది’ అని వ్యాఖ్యానించారు. అటు కెప్టెన్‌గా గిల్‌ను ఎంపిక చేయడాన్ని సమర్థించారు.
News October 7, 2025
AIలో సత్తా చాటి.. PM చేతుల మీదుగా అవార్డు

ఖమ్మం జిల్లాకు చెందిన తాళ్లూరి పల్లవి AI ఆల్ ఇండియా ట్రేడ్ టాపర్‌గా ఎంపికై ప్రధాని చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. యువతలో స్కిల్‌డెవలప్‌మెంట్, ఉద్యోగ నైపుణ్యాల్ని పెంచేందుకు PM-SETU పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంట్లో భాగంగా అత్యుత్తమ నైపుణ్యం కనపరిచిన విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. పల్లవి AI న్యూట్రిషన్ అసిస్టెంట్‌ను తయారు చేశారు. వ్యక్తిగత డైట్‌ను అందించడంలో ఇది సహకరిస్తుంది.