News October 7, 2025

10 వీక్లీ స్పెషల్ ట్రైన్ల టర్మీనల్ మార్పు

image

తిరుపతి రైల్వే స్టేషన్ వరకు నడిచే పది ట్రైన్స్ టెర్మినల్స్‌ను దక్షిణ మధ్య రైల్వే మార్పు చేసింది. వీక్లీ స్పెషల్ కింద నడిచే పది ట్రైన్స్ తిరుచానూరు స్టేషన్ వరకు నడవనున్నాయి. 07609, 07610, 07251, 07252, 07015, 07016, 07009, 07010, 07017, 07018 ట్రైన్స్ ఇకపై తిరుచానూరు స్టేషన్ నుంచి నడవనున్నాయి.

Similar News

News March 19, 2026

కలెక్టరేట్‌లో ఉగాది సంబరాలు

image

రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఉగాది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి MLC సోము వీర్రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అధికారులతో కలిసి పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తున్న సిబ్బందిని ఆయన అభినందించారు. తెలుగు సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.

News March 19, 2026

సంగారెడ్డి: కిడ్నాపర్‌లను రాళ్లతో కొట్టిన పిల్లలు

image

సంగారెడ్డి ద్వారకానగర్ మైదానంలో ఆడుకుంటున్న పిల్లలను కిడ్నాప్ చేసేందుకు దుండగులు గురువారం విఫలయత్నం చేశారు. ఆటోలో వచ్చిన ముగ్గురు ఓ బాలుడిని బలవంతంగా ఎక్కించుకునేందుకు ప్రయత్నించగా.. తోటి పిల్లలు భయపడకుండా వారిపై రాళ్లతో దాడికి దిగారు. పిల్లల అరుపులతో స్థానికులు అప్రమత్తం కావడంతో నిందితులు ఆటోలో పరారయ్యారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నామని సీఐ రాము నాయుడు తెలిపారు.

News March 19, 2026

రేవంత్‌కు పాలనాపరంగా ఇబ్బందుల్లేవు.. పంచాంగ శ్రవణం

image

TG: నూతన సంవత్సరంలో వాణిజ్యం పంటలు సమృద్ధిగా పండుతాయని రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది పంచాంగ శ్రవణంలో బాచంపల్లి సంతోశ్ కుమార్ వెల్లడించారు. రైతులు ఆనందంగా ఉంటారని తెలిపారు. ఒడిదుడుకులు ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డికి పాలనాపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. TPCC చీఫ్ మహేశ్ గౌడ్ నూతన పదవులు చేపడతారని పేర్కొన్నారు.