News October 7, 2025
కుమారుడు వేదనను కలెక్టర్‌కు చెప్పుకున్న తల్లి

సోమవారం శ్రీకాకుళంలోని పీజీఆర్‌ఎస్‌కు కనుగులువానిపేటకు చెందిన సోనియా అచేతనంగా ఉన్న నాలుగేళ్ల కూమారిడితో వచ్చింది. ఆ బాలుడు పడుతున్న వేదనను కలెక్టర్‌కు చెప్పుకుంది. రేండేళ్లకే పిట్స్ వచ్చి ఎదుగుదల లేక మంచానికే పరిమితమయ్యాడని, దివ్యాంగ ధ్రువీకరణ పత్రం మంజూరు చేసి బెడ్ రెస్ట్ పింఛన్ రూ.15,000 ఇవ్వాలని కోరింది. తల్లి ఒడిలో చైతన్యం లేకుండా ఉన్న బాలుడ్ని చూసిన అర్జీదారుల మనస్సు కలవరానికి గురిచేసింది.
Similar News
News March 17, 2026
నందిగాం: తృటిలో తప్పిన పెను ప్రమాదం

నందిగాం మండలం లట్టిగాం సమీపంలో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడికి గాయాలయ్యాయి. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పలాస నుంచి 49 మంది ప్రయాణికులతో శ్రీకాకుళం వెళ్తున్న పల్లె వెలుగు బస్సు రిక్వెస్ట్ బస్ స్టాప్ వద్ద ఆగడంతో వెనుక నుంచి వస్తున్న ట్రావెల్ బస్సు ఢీకొంది.
News March 17, 2026
శ్రీకాకుళం: ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు

మందస మండలంలోని పిడిమందస గ్రామానికి చెందిన సేనాపతి విక్రమ్ కుమార్ ఒకేసారి మూడు ఉద్యోగాలను సాధించాడు. సామాన్య పేద రైతు కుటుంబంలో జన్మించిన ఈయన చదువు ప్రభుత్వ పాఠశాలలో సాగింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసిస్టెంట్ క్లర్క్(కర్ణాటక), ఐబీపీఎస్ క్లర్క్, కెనరా బ్యాంక్, కర్ణాటక, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. స్థానికులు అభినందనలు తెలిపారు.
News March 17, 2026
SKLM: ‘ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను వినియోగించుకోవాలి’

విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని, ఉన్నత లక్ష్యాలతో చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు ఆకాంక్షించారు. సోమవారం ఆయన ఆమదాలవలస పట్టణంలోని బీసీ, ఎస్సీ బాలికల వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు, పౌష్టికాహారం అందుతుందా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.


