News October 7, 2025

ములకలచెరువు కేసు ఎఫెక్ట్.. బెల్ట్ షాపులు క్లోజ్

image

ములకలచెరువు కల్తీ మద్యం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక్కడ తయారు చేసిన మద్యాన్ని కొన్ని బెల్టు షాపులకు తరలించినట్లు సమాచారం. ఈ కేసు నిందితుల వద్ద ఓ డైరీ దొరికిందని.. అందులో కొంత మంది బెల్ట్ షాపుల పేర్లు ఉన్నట్లు సమాచారం. దీని ఆధారంగా ఎక్సైజ్ సిబ్బంది లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బెల్ట్ షాపులపై ఆరా తీస్తుండటంతో చాలాగ్రామాల్లో తాత్కాలికంగా మూసివేసినట్లు సమాచారం.

Similar News

News March 12, 2026

‘జాబ్ క్యాలెండర్’పై రేపు కీలక భేటీ

image

AP: ఉగాదికి జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆయా శాఖలవారీగా ఖాళీల వివరాలను ఆర్థిక శాఖ సేకరించింది. రేపు అన్ని విభాగాధిపతులతో కీలక భేటీ నిర్వహించనుంది. ఆ తర్వాత ఖాళీలపై తుది జాబితాను రూపొందించనున్నట్లు సమాచారం. కాగా రాష్ట్రంలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారం ఫేక్ అని కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

News March 12, 2026

ఖమ్మం: తీరిన గ్యాస్ గండం.. భోజన కష్టాలు దూరం

image

యుద్ధ ప్రభావంతో గ్యాస్ ఏజెన్సీలు సరఫరా నిలిపివేయడంతో జిల్లాలోని హాస్టళ్లలో నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. సిలిండర్ల కొరతతో భోజన తయారీకి ఇబ్బందులు ఎదురవ్వగా.. అ.కలెక్టర్ శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకున్నారు. గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షించి, వసతి గృహాలకు నిరంతరాయంగా సరఫరా చేయాలని ఆదేశించారు. దీంతో విద్యార్థుల భోజనానికి ఆటంకం తొలగిందని, ముందస్తు నిల్వలు పెంచుతున్నామని DBCDO జ్యోతి తెలిపారు.

News March 12, 2026

మహిళా జవాన్‌ను మోసం చేశాడు!

image

పామిడి(M) రామగిరికి చెందిన లోక్‌నాథ్‌ (అగ్నివీర్‌) బెంగాల్‌లో జవాన్‌గా ఉన్న మహిళను పెళ్లి పేరుతో మోసం చేశాడు. ఇన్‌స్టాలో వీరి మధ్య పరిచయం ఏర్పడగా ఆమె భర్తతో కలహాలు, కుటుంబ విషయాలను పంచుకున్నారు. తాను అండగా ఉంటానని దగ్గరైన లోక్‌నాథ్‌ పెళ్లి చేసుకుంటానని అనంతపురం రప్పించి లాడ్జిలో లొంగదీసుకున్నాడు. తర్వాత ముఖం చాటేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై మోసం, అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.