News October 7, 2025

జూబ్లీహిల్స్ బైపోల్.. చంద్రబాబు ప్లాన్ ఇదేనా?

image

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో పోటీపై TDP కసరత్తు మొదలుపెట్టింది. అనూహ్యంగా నందమూరి సుహాసిని పేరును తెరపైకి తెచ్చింది. ఇప్పటికే APలో BJPతో పొత్తు పెట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు.. TGలో ఈ బైపోల్‌తో రీఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని, BJPతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు టాక్. దీనిపై BJP జాతీయ నేతలతో CBNచర్చించనున్నారు. ఒకవేళ BJPపొత్తుకు ఒప్పుకోకుంటే ఒంటరిగా పోటీ చేయనున్నారు.

Similar News

News March 13, 2026

గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్‌పై ఉక్కుపాదం: మంత్రి ఉత్తమ్

image

ఎల్పీజీ గ్యాస్ కొరతపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కలిసి జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 288 కేసులు నమోదు చేశామన్నారు.

News March 13, 2026

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి: జనగామ కలెక్టర్

image

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. జిల్లాలో రెండు విడతల్లో 5,647 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 241 ఇళ్లు పూర్తి అయినట్లు తెలిపారు. మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో పీడీ హౌసింగ్ మాతృ నాయక్, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.

News March 13, 2026

ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదు: కలెక్టర్

image

జిల్లాలో గృహ అవసరాలకు సరిపడా ఎల్పీజీ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పష్టం చేశారు. బుధవారం భువనగిరి పట్టణ కేంద్రంలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఎల్పీజీ గ్యాస్ సరఫరా పర్యవేక్షణ కమిటీ’ సమావేశంలో ఆయన మాట్లాడారు. సిలిండర్ల సరఫరాలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.