News October 7, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. BRS గెలుస్తుందా?

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్‌పైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతకే టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ అభివృద్ధి చేస్తున్నామని ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు KCR వైపే ఉన్నారని, తామే విజయం సాధిస్తామని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కంటోన్మెంట్లో జరిగిన ఉపఎన్నికలో సత్తా చాటని ‘కారు’ ఈ ఎన్నికలోనైనా స్పీడ్ పెంచుతుందో లేదో చూడాలి.
Similar News
News October 7, 2025
జూబ్లీహిల్స్ బై పోల్స్.. టీడీపీ ఓటు బ్యాంకుపై నేతల ఆరా

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇపుడు అందరి చూపూ ఓటు బ్యాంకుపైనే ఉంది. ఏయే పార్టీలకు ప్రజలు మద్దతిస్తారనే విషయంపైనే నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి 2014లో మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. ఆ తరువాత బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అయితే ఇంకా టీడీపీకి ఓటు బ్యాంకు ఉందని నాయకులు నమ్ముతున్నారు. సైకిల్ పార్టీకి ఎన్ని ఓట్లు ఉంటాయని ఆరా తీస్తున్నారు.
News October 7, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం ఎంసీఎంసీ కమిటీ ఏర్పాటు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి.కర్ణన్ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ)ను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రచురితమయ్యే వార్తలు, ప్రకటనలు, చెల్లింపు వార్తలపై ఈ కమిటీ పర్యవేక్షణ చేయనుంది. కర్ణన్ కమిటీ ఛైర్మన్‌గా, PRO మామిండ్ల దశరథం మెంబర్ సెక్రటరీగా ఉన్నారు. కమిటీ ఎన్నికల పారదర్శకత, మీడియా సమన్వయానికి సహకరించనుంది.
News October 7, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. విధుల్లో ఐదువేల మంది

ఎన్నికల ప్రకటన వచ్చిన తరువాత రాజకీయ పార్టీలో టెన్షన్ ఉండటం సహజం. అయితే ఎన్నికలు నిర్వహించే అధికారులు, సిబ్బందికి కూడా ఆందోళన ఉంటుంది. ఎక్కడా.. ఎటువంటి పొరపాట్లు జరుగకుండా ఎన్నికలు నిర్వహించాలి. లేకపోతే చీవాట్లు తప్పవు. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు 5వేల మందిని నియమించారు. ఇబ్బందులు తలెత్తకుండా ఎవరెవరు ఏమేమి పనులు చేయాలనేది వారికి స్పష్టంగా వివరించారు.