News October 7, 2025
పాయకరావుపేట: తీరానికి కొట్టుకొచ్చిన విద్యార్థి మృతదేహం

పాయకరావుపేట మండలం పాల్మాన్‌పేట సముద్ర తీరంలో సోమవారం సాయంత్రం గల్లంతయిన పాలిటెక్నిక్ విద్యార్థి అశోక్ (19) మృతదేహం లభ్యమయింది. మంగళవారం ఉదయం అదే మండలం కొర్లయ్యపేట సముద్రతీరానికి కొట్టుకు వచ్చింది. స్థానిక మత్స్యకారులు సమాచారాన్ని మెరైన్ పోలీసులకు అందజేశారు. సముద్ర స్థానం చేసి బయటకు వస్తుండగా పెద్ద కెరటం వచ్చి అశోక్‌ను లోపలికి లాక్కుపోవడంతో గల్లంతయిన విషయం తెలిసిందే.
Similar News
News October 7, 2025
ములుగు: ప్రశ్నార్థకంగా ‘మావో’ల గమ్యం..!

పీడత ప్రజలు, సమసమాజ స్థాపన కోసం అడవిబాట పట్టిన అన్నల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వరుస ఎన్కౌంటర్లు, అగ్ర నేతల మృత్యువాతతో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉండగా వందల సంఖ్యలో మావోయిస్టులు, కీలక నేతల లొంగుబాట్లు, పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా ఎటూ పాలుపోనీ పరిస్థితి నెలకొంది. మరోవైపు 2026 మార్చి 31కి మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే.
News October 7, 2025
రాజమండ్రిలో వైద్య సేవల నాణ్యతపై కలెక్టర్ ఆరా

ప్రభుత్వ ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవల నాణ్యతపై కలెక్టర్ కీర్తి చేకూరి ఆరా తీశారు. మంగళవారం ఆమె రాజమండ్రిలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. పలు వార్డులు, పరికరాలు, రికార్డులు పరిశీలించారు. మందుల నిల్వలు, పరిక్షల నిర్వహణ, అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ విధానాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో పరిశుభ్రతను మెరుగుపరచాలన్నారు. పారిశుద్ధ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు.
News October 7, 2025
‘SIR’ ఎన్నికల కమిషన్ విశేషాధికారం: SC

బిహార్‌లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ఎన్నికల కమిషన్ విశేషాధికారమని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇందులో జోక్యం చేసుకోలేమని విచారణ సందర్భంగా పేర్కొంది. అందరి విధుల్లో తాము జోక్యం చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారని పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు బిహార్‌లో ఫైనల్ ఓటర్ లిస్ట్‌ను ప్రకటించినట్లు కోర్టుకు EC తెలిపింది. రాజకీయ నాయకులే అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని వివరించింది.