News October 7, 2025
ప్రైవేటు ఉద్యోగులకు ‘రైట్ టు డిస్కనెక్ట్’ కావాల్సిందేనా?

గ్లోబల్ లైఫ్-వర్క్ బ్యాలెన్స్ ఇండెక్స్-2025లో 42వ స్థానంలో ఉన్న భారత్‌లో ఉద్యోగుల పని భారం చర్చనీయాంశమైంది. దీనికి పరిష్కారంగా కుటుంబంతో ఉన్నప్పుడు వర్క్ కాల్స్, మీటింగ్స్, మెసేజ్‌లకు దూరంగా ఉండేందుకు వీలు కల్పించే ‘రైట్ టు డిస్కనెక్ట్’ బిల్లును కేరళ ఎమ్మెల్యే జయరాజ్ ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఇలాంటి బిల్లును తీసుకురావాలనే చర్చ జరుగుతోంది. దీనిపై మీరేమంటారు?
Similar News
News March 6, 2026
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేనివారికి శ్రీవారి దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. వేంకటేశ్వరుడి సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం 59,194 మంది శ్రీవారిని దర్శించుకోగా 25,295 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.87 కోట్లు వచ్చినట్లు TTD తెలిపింది.
News March 6, 2026
సూపర్ హీరో మూవీలో సల్మాన్ ఖాన్?

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సూపర్ హీరో కామెడీ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. దర్శక ద్వయం రాజ్ & DK ఆయనకు కథ చెప్పినట్లు సినీవర్గాలు తెలిపాయి. సల్మాన్‌కు స్టోరీ నచ్చిందని, కానీ భారీ బడ్జెట్ వద్దని దర్శకులకు చెప్పారని పేర్కొన్నాయి. రిటైర్ అవ్వాలనుకున్న ప్రతిసారి సమస్యలు ఎదురై యాక్షన్‌లోకి దిగే సూపర్ హీరో పాత్రలో కనిపిస్తారని చెప్పాయి. హాలీవుడ్ మూవీ ‘హాంకాక్’ తరహాలో కథ ఉండొచ్చని వివరించాయి.
News March 6, 2026
ఇక మారవా బ్రో..!

నిన్న టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో ఇంగ్లండ్‌పై భారత్ గెలిచినా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. 9 పరుగుల వద్ద మరోసారి చెత్త షాట్‌తో వికెట్ పారేసుకున్నారు. దీంతో ఈ టోర్నీలో పేలవ ప్రదర్శన కంటిన్యూ చేస్తున్నారు. మాజీలు సైతం నిలకడగా ఆడాలని చెబుతున్నా అభి ఆటతీరు మారడం లేదు. ఇక టోర్నీలో మిగిలింది ఫైనల్ మాత్రమే. మరి అందులోనైనా రాణించి భారత్‌కు కప్పు అందిస్తారో లేదో చూడాలి.


