News October 7, 2025
జమ్మికుంట: గూడ్స్ రైలు కింద పడి వ్యక్తి మృతి

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం రైల్వే గేటు వద్ద గూడ్స్ రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కాజీపేట- రామగుండం రైల్వే లైన్‌లో రామగుండం వైపు వెళ్తున్న గూడ్స్ రైలు కింద పడి మండలంలోని శాయంపేట గ్రామానికి చెందిన పంజాల సాగర్(43) ప్రాణాలు కోల్పోయాడు. అయితే మృతుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేదా ప్రమాదానికి గురై మృతి చెందాడా? అనే విషయం తెలియాల్సి ఉంది.
Similar News
News March 23, 2026
ములుగు: అమిత్ షా డెడ్‌లైన్‌కు మరో 8 రోజులే!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టులకు ఇచ్చిన గడువు ముగియడానికి మరో 8 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో లొంగుబాట్లు పెరిగాయి. ఈ ఏడాది వందల సంఖ్యలో మావోయిస్టులు ఆయుధాలు విడిచి ప్రధాన ప్రవాహంలో చేరగా, ఎన్‌కౌంటర్లలో కూడా పలువురు మృతి చెందారు. ప్రభుత్వ ఒత్తిడి, ఆపరేషన్లతో పరిస్థితి కీలక దశకు చేరింది. 31 తర్వాత అమిత్ షా ప్రకటనపై ఆసక్తి నెలకొంది.
News March 23, 2026
సూర్యాపేట: నాయబ్ తహశీల్దార్ సస్పెన్షన్: కలెక్టర్

కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా పౌతి(సక్సెషన్) చేసిన మేళ్లచెర్వు నాయబ్ తహశీల్దార్ శ్రీధర్ నాయక్ పై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సస్పెన్షన్ వేటు వేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అక్రమాలకు పాల్పడినందుకు ఆయన్ను సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు.
News March 23, 2026
అమరచింత: తండ్రి మరణించినా.. పరీక్షకు హాజరు

అమరచింత మండలం నందిమల్ల ఎక్స్ రోడ్డు గ్రామంలో విషాదం నెలకొంది. పదో తరగతి విద్యార్థి సాగర్ తండ్రి జలంధర్ ఆదివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. పుట్టెడు దుఃఖంలోనూ సాగర్ సోమవారం తన పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష ముగిసిన వెంటనే ఇంటికి చేరుకుని తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. విద్యార్థి ధైర్యాన్ని చూసి గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు.


