News October 7, 2025
VZM: డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్

విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 10 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు డా.పద్మజ తెలిపారు.
➤ సమయం: ఈనెల 13న ఉ.10.30 – మ.2వరకు
➤ వేదిక: GGH కాన్ఫరెన్స్ హాలు
➤ అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ (75%) + PGDCA (25%)
➤ ఎంపిక విధానం: మార్కుల ఆధారంగా
➤ వెబ్‌సైట్: <
విజయనగరం జిల్లాకు చెందిన వారు మాత్రమే అర్హులు
Similar News
News October 7, 2025
VZM: సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డులు

స్వచ్ఛ ఆంధ్ర 2025 అవార్డులలో రాష్ట్రస్థాయి అవార్డును ఏపీ ఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ లక్ష్మణరావు అందుకున్నారు. విజయవాడ వేదికగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా లక్ష్మణరావు అవార్డు తీసుకున్నారు. అలాగే బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి కూడా అవార్డు అందుకున్నారు. ఇద్దరికీ జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
News October 6, 2025
VZM: జీవితం అంటే సంపూర్ణమైన ఆరోగ్యం

జీవితం అంటే సంపూర్ణ ఆరోగ్యమని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, హోం శాఖామంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం జరిగిన స్వచ్ఛాంధ్ర-2025 జిల్లా స్థాయి అవార్డుల ప్రధానోత్సవానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మొత్తం 48 మంది వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను పంపిణీ చేశారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండటంలో పారిశుద్ధ్య కార్మికులు పాత్ర చాలా కీలకమన్నారు.
News October 6, 2025
సూపర్ జీఎస్టీ క్యాంపెయిన్‌పై కలెక్టర్ సమీక్ష

సూపర్ GST క్యాంపెయిన్ లో షెడ్యూల్ లో ఇచ్చిన లక్ష్యాల మేరకు ఏ రోజు కార్యక్రమాలను ఆ రోజే పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం తన ఛాంబర్‌లో అధికారులు సిబ్బందితో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో సూపర్ జీఎస్టిపై అవగాహనా తరగతులను నిర్వహించి, విద్యార్థులకు పోటీలను కూడా నిర్వహించాలని సూచించారు.